Site icon NTV Telugu

Actor Abhishek: డ్రగ్స్ కేసులో సినీ నటుడు అరెస్ట్

Abhishek Arrest

Abhishek Arrest

Actor Abhishek arrested in Drugs Case: హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో ఒక సినీ నటుడు అరెస్ట్ అయ్యాడు. సినీ నటుడు అభిషేక్ ను గోవాలో యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో పలు సినిమాల్లో సహాయక పాత్రలు పోషిస్తూ వచ్చిన అభిషేక్ మీద ఎస్సార్ నగర్ , జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు డ్రగ్స్ కేసులు ఉన్నాయి. అయితే కోర్టు కేసులకు అభిషేక్ హాజరు కాకపోవడంతో తాజాగా కోర్టు అరెస్టు వారంటు జారీ చేసింది. అసలు అభిషేక్ ఎక్కడున్నాడా అని పోలీసులు వెతుకులాటలో పడగా అతను హైదరాబాదు నుంచి పారిపోయి గోవాలో ఒక రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు.

Devara : ఫాన్స్ కి షాక్.. అక్కడ 1 AM షోస్ క్యాన్సిల్.. ఎందుకంటే?

ఇక అభిషేక్ ను గోవాలో అరెస్టు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అతన్ని పీటీ వారెంటు మీద హైదరాబాదు తీసుకొచ్చారు. హైదరాబాద్ లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్- సిసిఎస్ కి తరలించి అక్కడ విచారణ జరుపుతున్నారు. అయితే అభిషేక్ కి డ్రగ్స్ కేసులు కొత్త కాదు. 2012 నుంచి పలు దఫాలుగా పోలీసులు అతన్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తూ వచ్చారు. అయితే, డేంజర్, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా అలాంటి సినిమాలలో అభిషేక్ నటించాడు. ఇక ఆ తరువాత డ్రగ్స్ కేసులు మొదలయ్యాక సినిమా అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు పూర్తిగా అవకాశాలు లేకపోవడంతో గోవా వెళ్లి అక్కడ రెస్టారెంట్ నడుపుకుంటున్నాడు.

Exit mobile version