NTV Telugu Site icon

Action King: యాక్షన్ కింగ్ అర్జున్ కు మాతృ వియోగం

Arjun

Arjun

Action King Arjun has lost his mother

సీనియర్ నటుడు అర్జున్ మాతృ మూర్తి లక్ష్మీ దేవమ్మ శనివారం కన్నుమూశారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. మైసూర్ లో స్కూల్ టీచర్ గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆమె పార్థీవ దేశాన్ని బెంగళూరు అపోలో హాస్పిటల్ లో ఉంచారు. ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు అర్జున్ ను కలిసి సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాల నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన అర్జున్… ఆ తర్వాత హీరోగా రాణించారు. పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య సైతం తెలుగులో ఓ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

Show comments