ఈ ఏడాది చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ అంచనాలు మించి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.90 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. ఈ విజయం వెనుక ఉన్న క్రియేటివ్ మైండ్ ఎవరో తెలుసా? అభిషన్ జీవింత్. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రం, కంటెంట్ బలమే విజయాన్ని సాధించగలదని రుజువు చేసింది. ఈ అద్భుత విజయానంతరం, అభిషన్ తర్వాత ఎలాంటి సినిమా చేస్తారో అని ఇండస్ట్రీ అంతా ఎదురు చూసింది. కానీ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ..
Also Read : Kotha Loka : భారత తొలి మహిళా సూపర్ హీరో మూవీ ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ రిలీజ్!
హీరోగా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను సౌందర్య రజనీకాంత్ నిర్మాణ సంస్థ జియాన్ పిక్చర్స్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మించనున్నాయి. సినిమాకు మదన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అభిషన్ సరసన మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటించనున్నారు. నిర్మాణ సంస్థ ఈ అప్‌కమింగ్ ఫిల్మ్ వివరాలను అధికారికంగా ప్రకటించింది. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. అభిషన్ ఎప్పటి నుంచో యాక్టింగ్‌పై ఆసక్తి చూపుతున్నారని, కానీ తన మొదటి లవ్ డైరెక్షన్ కావడంతో ముందుగా దర్శకుడిగా పరిచయం అయ్యారని ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు ఆ కలను నిజం చేసుకుంటూ హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఫిల్మ్ లవర్స్‌లో కొత్త ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసింది.
