NTV Telugu Site icon

Abhishek Bachchan: మొదట్లో కష్టంగా అనిపించేది.. నా ఆలోచన మార్చుకున్నా : అభిషేక్ బచ్చన్

Untitled Design (10)

Untitled Design (10)

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ గురించి పరిచయం అక్కర్లేదు. సినీ రంగంలొ హీరోగా అడుగు పెట్టి మంచి మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలు తీశారు. కానీ అనుకున్నంతగా హిట్ లు మాత్రం అందుకోలేకపోయాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ బచ్చన్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. కెరీర్ పరంగా తనని, తన వైఫ్ ఐశ్వర్యరాయ్ పోల్చి చూడడం పై ఆయన స్పందించారు.

అభిషేక్ మాట్లాడుతూ ‘ సిని కెరీర్ విషయంలో కొన్ని మాటలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అది అంత సులభం కాదు. నిజం చెప్పాలంటే మొదట్లో ఎంతో కష్టంగా అనిపించింది. రాను రాను నా ఆలోచనా విధానం మార్చుకున్న. నా దృష్టిలో మా నాన్న ది బెస్ట్. ఆయనతో నన్ను పోలుస్తున్నారంటే దానికి నేను అర్హుడిని అని ఎదుటి వాళ్లు భావిస్తున్నారు. అందుకు సంతోషిస్తున్నా. నా కుటుంబం, భార్య విషయంలో ఎంతో గర్వంగా ఉంది. వారు సాధించిన ఘనత, భవిష్యత్తులో చేయనున్న వర్క్ పై సంతోషంగా ఉన్నా. నాకు కూడా మా నాన్న మాదిరిగా 80ల్లోనూ వర్క్ చేయాలని ఉంది. ఎనిమిది పదుల వయసులోనూ నాన్న వర్క్ చేస్తున్నారు. సినిమాలు, షోలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అదేవిధంగా నేను కూడా ఆ వయసులోనూ వర్క్ చేస్తూ ఉండాలి. నా కూతురు ఆరాధ్యకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నా. నా కుటుంబం పై నాకు ఎంతో గౌరవం ఉంది. వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. వారి నిర్ణయాన్ని ఎప్పటికీ గౌరవిస్తా. మా తాతయ్య మాకు అందించిన ప్రేమ, గౌరవాన్ని ఇంకా పెంచుతాం’ అని తెలిపారు.