Abhishek Bachchan: రతన్ టాటాగా అభిషేక్ బచ్చన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Bachchan As Ratan Tata: ‘గురు’, ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాలతో దర్శకురాలిగా తనను తాను నిరూపించుకున్నారు సుధా కొంగర. సూర్య హీరోగా సింప్లిఫై డెక్కన్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ బయోపిక్‌ను ‘ఆకాశమే నేహద్దురా’గా తీసిన తర్వాత మరి కొన్ని బయోపిక్స్ పై దృష్టి సారించినట్లు సుధా కొంగర తెలిపారు. అయితే వినిపిస్తున్న వార్తలను బట్టి సుధా కొంగర ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారట. ఈ సినిమాను సుధా కొంగరతో కలసి హోంబలే ఫిల్మ్స్, అభిషేక్ బచ్చన్, సూర్య నిర్మించబోతున్నారని తెలియవస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ హాట్ గా టాక్ నడుస్తోంది.
టాటా సన్స్ మాజీ చైర్మన్, టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు, లెజెండరీ జెమ్సెట్ జీ టాటా మనవడు సూపర్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ మేన్ అయిన రతన్ టాటా కథను వీరు వెండితెరకు ఎక్కించనున్నారు. టెట్లీ టీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ గ్రూప్, యూరప్ స్టీల్ దిగ్గజం కోరస్‌ను కొనుగోలు చేసిన తర్వాత రతన్ టాటా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వెలుగొందింది. అభిషేక్ బచ్చన్ తెరపై రతన్ టాటా పాత్రను పోషించనున్నట్లు సమాచారం. గతంలో మణిరత్నం ‘గురు’లో అభిషేక్ ధీరూభాయ్ అంబానీ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రతన్ టాటా పాత్ర పోషిస్తే వరుసగా వ్యాపార వేత్తల పాత్రలను పోషించిన ఘనతను సాధించినట్లు అవుతుంది.
Also Read
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
- అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ 'AK47' ఔట్? అసలు కారణం ఇదే..
- Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!