Site icon NTV Telugu

Abhishek Bachchan: రతన్ టాటాగా అభిషేక్ బచ్చన్‌

Ahishek As Ratan Tata

Ahishek As Ratan Tata

Abhishek Bachchan As Ratan Tata: ‘గురు’, ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాలతో దర్శకురాలిగా తనను తాను నిరూపించుకున్నారు సుధా కొంగర. సూర్య హీరోగా సింప్లిఫై డెక్కన్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ బయోపిక్‌ను ‘ఆకాశమే నేహద్దురా’గా తీసిన తర్వాత మరి కొన్ని బయోపిక్స్ పై దృష్టి సారించినట్లు సుధా కొంగర తెలిపారు. అయితే వినిపిస్తున్న వార్తలను బట్టి సుధా కొంగర ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారట. ఈ సినిమాను సుధా కొంగరతో కలసి హోంబలే ఫిల్మ్స్, అభిషేక్ బచ్చన్, సూర్య నిర్మించబోతున్నారని తెలియవస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ హాట్ గా టాక్ నడుస్తోంది.

టాటా సన్స్ మాజీ చైర్మన్, టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు, లెజెండరీ జెమ్సెట్ జీ టాటా మనవడు సూపర్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ మేన్ అయిన రతన్ టాటా కథను వీరు వెండితెరకు ఎక్కించనున్నారు. టెట్లీ టీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ గ్రూప్, యూరప్ స్టీల్ దిగ్గజం కోరస్‌ను కొనుగోలు చేసిన తర్వాత రతన్ టాటా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వెలుగొందింది. అభిషేక్ బచ్చన్ తెరపై రతన్ టాటా పాత్రను పోషించనున్నట్లు సమాచారం. గతంలో మణిరత్నం ‘గురు’లో అభిషేక్ ధీరూభాయ్ అంబానీ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రతన్ టాటా పాత్ర పోషిస్తే వరుసగా వ్యాపార వేత్తల పాత్రలను పోషించిన ఘనతను సాధించినట్లు అవుతుంది.

Exit mobile version