NTV Telugu Site icon

Aashika Ranganath: నాగార్జునతో కలిసి నటించడం అదృష్టం.. ఆరోజు నుంచి ఒక్కరోజూ వదలకుండా పంపేవారు!

Aashika Ranganath

Aashika Ranganath

Aashika Ranganath Speech at Naa Saami Ranga Pre Release Event: నాగార్జున హీరోగా ఆశగా రంగనాథ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం నా సామి రంగ. సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ ఆషిక మాట్లాడుతూ నా సామిరంగా ఫీవర్ ఎలా ఉంది? పండక్కి రెడీగా ఉన్నారా? మేమైతే ఫుల్ గా రెడీ అయ్యాం. సూపర్ గా ఎక్సైట్ అయి ఉన్నాం, పండక్కి సినిమా రిలీజ్ చేయాలని చాలా కష్టపడి ఇన్ని రోజులు షూట్ చేసి 14వ తేదీ జనవరి రిలీజ్ చేస్తున్నాం, అందరికీ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాం. ఇక్కడ వచ్చినోళ్ళందరికీ థాంక్స్. సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ స్టఫ్ చూసి చాలా సపోర్టు ఇచ్చారు, అందరికీ థాంక్స్ మీకు వరాలు క్యారెక్టర్ నచ్చిందా అని ప్రశ్నించారు. ఎలా అనిపించింది మీ అందరికీ అని అడిగి ఇది తనకు చాలా స్పెషల్ క్యారెక్టర్ అని ఎందుకంటే రెండు భిన్న పార్శ్యాలు ఉన్న పాత్రలో నటించానని అందుకే ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు. నాగార్జునతో పని చేసినందుకు నేను చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నా, నేను చాలా లక్కీ అని అన్నారు.

Guntur Kaaram: ‘గుంటూరు కారం’కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఆయన పక్కన నటిస్తున్నానని తెలిసి ఆయన నటించిన ఎన్నో సినిమాలు చూశా, అందులో ఆయన నటన చూసి అబ్బురపడ్డా. అయితే ఆయనతో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఫస్ట్ లుక్ టెస్ట్ చేయడానికి కలిసినప్పుడే మాకు చాలా సపోర్టివ్ గా అనిపించారు. షూట్లో కూడా ప్రతిసారి నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆయనని అందరూ ఎందుకు కింగ్ అంటారో ఆయనతో కలిసి నటించిన తర్వాత అర్థమైంది. నేను కర్ణాటక నుంచి వచ్చా, ఇక్కడ నాకు ఇల్లు లేదు అయితే నేను వర్క్ అవుట్ చేస్తూ ఉంటా, హెల్దీ ఫుడ్ తింటాను అని తెలిసి ఆయనకు తెలిసిన రోజు నుంచి నాకు ఆయనతో పాటు బాక్స్ తెప్పించేవారు. మీతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది అని ఆమె చెప్పుకొచ్చారు. కీరవాణి లాంటి సంగీత దర్శకుడు అందించిన సినిమాలు ఎన్నో చూశా, ఆయన నిన్ను నటించే సినిమాకి సంగీతం అందిస్తారని ఎప్పుడు ఊహించ లేదు. తనను నమ్మి తనకు ఈ అవకాశం ఇచ్చి దర్శకుడు నటన రాబట్టుకున్నాడని చెప్పుకొచ్చారు. అల్లరి నరేష్ రాజ్ తరుణ్ మిర్నా మీనన్ రుక్సార్ థిల్లాన్ వంటి వారితో నటించి ఎంతో మంచి అనుభవాలు నేర్చుకున్నా, సినిమా టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న అందరూ థియేటర్లలో మా సినిమా చూడాలి అని చెప్పుకొచ్చారు.