Pathani Haar: ఆమిర్ ఖాన్ భార్య మెడలో మెరిసిన హైదరాబాదీ పఠానీ హార్.. అందరి చూపు దానిపైనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pathani Haar: పెళ్లి వేడుకల్లో వధువు ధరించే నగలు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా సంప్రదాయం, రాజసాన్ని ప్రతిబింబించే ఆభరణాలను సెలబ్రిటీలు ఎంచుకుంటే వాటిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలవుతుంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నిజామీ వారసత్వానికి చెందిన ఆభరణాలు బాలీవుడ్ ప్రముఖులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు సత్లదా హార్తో వార్తల్లో నిలిచిన పలువురు స్టార్ హీరోయిన్ల జాబితాలో ఇప్పుడు మరో పేరు చేరింది. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌ను వివాహం చేసుకున్న గౌరీ స్ప్రట్ తన పెళ్లి వేడుకలో ధరించిన హైదరాబాదీ పఠానీ హార్ ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
జూలై 5న ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆమిర్ ఖాన్ నివాసంలో గౌరీ స్ప్రట్‌తో ఆయన సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ వేడుకలో గౌరీ సంప్రదాయ ఎరుపు రంగు పెళ్లి దుస్తులకు బదులుగా ఐవరీ, పాస్టెల్ షేడ్స్‌తో రూపొందించిన సొగసైన లెహంగా ధరించారు. ఆ దుస్తులకు పోల్కీ నగలను జతచేసి క్లాసిక్ బ్రైడల్ లుక్‌ను ఎంచుకున్నారు. అయితే ఆమె లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం మాత్రం మెడలో మెరిసిన పఠానీ హార్.
Also Read
పఠానీ హార్ పేరు పఠాన్ కమ్యూనిటీతో అనుబంధం కలిగి ఉన్నప్పటికీ, ఇది హైదరాబాద్ నిజామీ రాజదర్బార్లలో ప్రత్యేక గుర్తింపు పొందిన వారసత్వ ఆభరణంగా ప్రసిద్ధి చెందింది. నేటికీ అనేక వారసత్వ నగల నిపుణులు దీన్ని నిజామీ హస్తకళకు ప్రతీకగా పేర్కొంటున్నారు. పఠానీ హార్ ప్రత్యేకత దాని పోల్కీ రత్నాల పనితనంలో ఉంటుంది. చేతితో రూపొందించే ఈ హారంలో ఒక్కో రత్నాన్ని ఎంతో శ్రద్ధగా అమర్చుతారు. అందుకే ప్రతి పఠానీ హార్ ఒక ప్రత్యేక కళాఖండంగా భావిస్తారు. రాజసాన్ని, సంప్రదాయాన్ని ఒకేసారి ప్రతిబింబించే ఈ డిజైన్ ఇప్పటికీ ఫ్యాషన్ ప్రపంచంలో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది.
హైదరాబాద్‌లో పఠానీ హార్‌కు ఉన్న ప్రాధాన్యం మరింత ప్రత్యేకమైనది. అనేక కుటుంబాల్లో ఇది తరతరాలుగా వారసత్వ ఆభరణంగా సంక్రమిస్తోంది. పెళ్లిళ్లు, ఈద్ వేడుకలు, కుటుంబ శుభకార్యాల్లో ఈ హారాన్ని ధరించడం ఇప్పటికీ ఆనవాయితీగా కొనసాగుతోంది. లాడ్ బజార్, గుల్జార్ హౌజ్ ప్రాంతాల్లోని ప్రముఖ నగల దుకాణాలు ఈ సంప్రదాయ డిజైన్‌ను ఆధునిక శైలితో మేళవించి కొత్త తరానికి అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
ఇప్పటికే దీపికా పదుకొణె, నయనతార వంటి ప్రముఖులు హైదరాబాద్ నిజామీ నగలతో ప్రత్యేక గుర్తింపు పొందగా, ఇప్పుడు గౌరీ స్ప్రట్ కూడా అదే వారసత్వాన్ని తన పెళ్లి అలంకరణలో భాగం చేసుకోవడం విశేషంగా మారింది. దీంతో హైదరాబాద్‌కు చెందిన ఈ చారిత్రక ఆభరణాలు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందుతున్నాయని ఫ్యాషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజామీ వైభవాన్ని ప్రతిబింబించే ఈ నగలు ఇప్పుడు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా వధువులకు ఒక బ్రాండ్ గా మారిపోయింది.
- Tags
- cinema
- Pathani Haar
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి!
-
Vallabhaneni Vamsi: పక్షపాతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. వల్లభనేని ఫైర్
-
Ramayana : ‘రామాయణ’ మొదలైందిలా… ముగింపులో మిగిలింది ఎవరు?
-
SS Rajamouli Reviews Ramayana: ‘రామాయణ’పై రాజమౌళి రివ్యూ వైరల్! ఏమన్నారంటే?
-
Ramayana : రణబీర్‌ను డామినేట్ చేసిన యష్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
ట్రెండింగ్
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!