Site icon NTV Telugu

Lal Singh Chadda: చిరు, నాగ్, రాజమౌళి, సుకుమార్ కు ‘లాల్ సింగ్ చద్దా’ ప్రివ్యూ

Lal Singh Chadda

Lal Singh Chadda

అమీర్ ఖాన్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’లో నాగచైతన్య ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమీర్ తన సినిమాను మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున, యస్.యస్. రాజమౌళి, సుకుమార్ కు ప్రత్యేకంగా ప్రదర్శించాడు. ఆమీర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కింది.

పలు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న సినిమాకు ఆధారం కావటంతో ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కరీనా కపూర్, మోనాసింగ్, మానవ్ విజ్, ఆర్యా శర్మ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ తో కలసి వయాకామ్ 18 స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించాయి. సంజు టికు, ప్రీతమ్ సంగీతం అందించారు. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ జరిగింది.

Exit mobile version