Site icon NTV Telugu

Aamir Khan : షారుఖ్, సల్మాన్ నా కెరీర్ ను తొక్కేస్తారనుకున్నా : అమీర్ ఖాన్

Aamir Khan

Aamir Khan

Aamir Khan : అమీర్ ఖాన్ ఈ నడుమ వరుసగా వార్తల్లో ఉంటున్నారు. మొన్ననే తాను కన్నడకు చెందిన గౌరీ స్ప్రాట్ తో డేటింగ్ చేస్తున్నట్టు బయటపెట్టాడు. దాని తర్వాత వరుసగా పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్స్ లకు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘నేను దంగల్ సినిమా కథ విన్నప్పుడు చేయొద్దని అనుకున్నా. ఎందుకంటే దానికి ముందే నేను డూమ్-3లో చేశా. చాలా యంగ్ లుక్ లో కనిపించాను. వెంటనే తండ్రి పాత్ర చేయాలంటే మనసు ఒప్పలేదు. కానీ ఎందుకో కథ పూర్తిగా చదవాలని అనుకున్నట్టు’ తెలిపారు.

Read Also : PAN Card Necessary: పన్ను చెల్లింపులు కాకుండా పాన్ కార్డ్ను ఎక్కడ ఎలా ఉపయోగిస్తారో తెలుసా?

‘ఆ కథ విన్నప్పుడు నా మనసులో ఓ అనుమానం కలిగింది. షారుఖ్, సల్మాన్ లు నా కెరీర్ ను తొక్కేయడానికి ఆ కథను నా వద్దకు పంపించారేమో అని అపార్థం చేసుకున్నాను. కానీ డైరెక్టర్ నితీష్ తివారీ నాతో తప్ప ఆ సినిమాను ఎవరితోనూ చేయనని చెప్పాడు. 15 ఏళ్లు అయినా వేచి చూస్తానని చెప్పాడు. కథ పూర్తిగా చదువుదామని ఆ స్క్రిప్టు తీసుకున్నాను. కథ చదివాక కచ్చితంగా సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నా. ఆ మూవీ నా అంచనాలకు మించి పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత సల్మాన్, షారుఖ్ లను అపార్థం చేసుకున్నందుకు బాధపడ్డాను’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. దంగల్ మూవీ ఇండియాలో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఆ మూవీ కలెక్షన్లే నెంబర్ వన్ గా ఉన్నాయి.

రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమా కూడా దంగల్ ను బ్రేక్ చేయలేకపోయింది. దంగల్ మూవీ చైనాలో కూడా భారీ వసూళ్లు సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుని అమీర్ ఖాన్ ను మరో స్థాయిలో నిలబెట్టింది ఈ మూవీ. ఈ మూవీ కోసం ఆయన పూర్తిగా తన లుక్ ను మార్చేసుకున్న తీరు అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version