NTV Telugu Site icon

Aadikeshava: సిత్తరాల సిత్రావతి వెంటపడుతున్న ఆదికేశవుడు

Sreeleela

Sreeleela

Aadikeshava: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదికేశవ. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో మలయాళ నటుడు జోజు జార్జ్ తెలుగుకు పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి మొదటి పాటను మేకర్స్ రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. తాజాగా ఆ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. సిత్తరాల సిత్రావతి అంటూ సాగిన ఈ సాంగ్ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. శ్రీలీల- వైష్ణవ్ ల మధ్య లవ్ సాంగ్ లా కనిపిస్తుంది.

Ram Charan: ప్రభాస్ ఛాలెంజ్ ను స్వీకరించిన చరణ్.. తన ఫేవరేట్ రెసిపీ ఏంటంటే.. ?

శ్రీలీల అందానికి ముగ్దుడైన వైష్ణవ్ .. ఆమె అందాన్ని పొగుడుతూ ఉంటే .. శ్రీలీల.. అతనిని పెళ్లి చేసుకోవాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. జీవీ ప్రకాష్ అందించిన సంగీతం.. రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా వాయిస్ మెస్మరైజ్ చేసాయి. ఇక ఈ ఫుల్ సాంగ్ ను సెప్టెంబర్ 9 న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాపై వైష్ణవ్ చాలా ఆశలనే పెట్టుకున్నాడు. ఉప్పెన తరువాత వైష్ణవ్ కు మరో మంచి హిట్ లేదు. అందుకే ఈసారి యాక్షన్ ఎంటర్ టైనర్ ను నమ్ముకున్నాడు. మరి ఈ సినిమాతో మెగా మేనల్లుడు ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Show comments