Aa Okkati Adakku Releasing On May 3rd: కామెడీ కింగ్ అల్లరి నరేష్, కొత్త దర్శకుడు మల్లి అంకం దర్శకత్వంలో ‘ఆ ఒక్కటీ అడక్కు సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా గత నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ పలు కారణాలతో వాయిదా పడింది. ఈనెల 19వ తేదీన రిలీజ్ చేస్తామని కొన్నాళ్ల క్రితం సినిమా యూనిట్ ప్రకటించింది అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడంతో 19వ తేదీ కూడా వాయిదా పడవచ్చని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాని మే మూడో తేదీన రిలీజ్ చేస్తున్నట్లుగా ఒక వీడియో రిలీజ్ చేసింది. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాకి భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత.
Nayanthara: దెబ్బకు నయనతారని కూడా మార్చేశారు కదరా!
ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోండగా టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ ‘ఆ ఒక్కటి అడక్కు’ ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇప్పటికే విడుదలయిన టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. సినిమా తగిన వినోదాన్ని అందిస్తుందని, ఇందులో లీడ్ పెయిర్ మధ్య అందమైన ప్రేమకథ కూడా ఉంటుందని టీజర్ తో క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాకి సూర్య సినిమాటోగ్రాఫర్ కాగా, గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తుండగా చోటా కె ప్రసాద్ ఎడిటర్, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జామీ లివర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
