NTV Telugu Site icon

Krithi shetty : ఆ డైరెక్టర్ భాష నన్ను బాగా ఇబ్బంది పెట్టింది…!!

8dc2caaf 601f 4d97 A7e0 95bd49a17b52

8dc2caaf 601f 4d97 A7e0 95bd49a17b52

సుకుమార్ శిష్యుడుగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది

ఆ తరువాత వరుసగా రెండు సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో పాటు ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా పేరు ను సంపాదించింది. కానీ ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ కావడంతో ఈమె కెరియర్ కొంత రిస్క్ లో పడిపోయింది. తన అందం అభినయంతో కుర్రకారులను కట్టిపడేసిన కృతి శెట్టి సోషల్ మీడియాలో మాత్రం తరచు అందాల ఆరబోత చేస్తూ నే ఉంటుంది.

తన మొదటి సినిమాతోనే రెచ్చిపోయి లిప్ లాక్ సన్నివేశాలు నటించిన కృతి శెట్టి ఆ తర్వాత చిత్రాలలో అలాంటి సన్నివేశాలలో అయితే నటించలేదు. ప్రస్తుతం కృతి శెట్టికి టైం బాగోలేదని చెప్పవచ్చు. ఆమె చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ గాని మిగులుతున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను అయితే తెలిపింది… ఒక స్టార్ డైరెక్టర్ భాష కారణంగా తాను బాగా ఇబ్బందులు పడ్డానని తెలియజేసింది.

కృతి శెట్టి, రామ్ పోతినేని కలిసి నటించిన వారియర్ సినిమా ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా ను దర్శకుడు లింగస్వామి దర్శకత్వం వహించారు. ఆయన తమిళ దర్శకుడు కావడంతో ఆయన తెలుగు భాషలో కొంచెం తమిళ యాస కూడా మిక్స్ అయి ఉంటుందని దాంతో కృతికి ఆయన తెలుగు అస్సలు అర్థం కాక బాగా ఇబ్బంది పడ్డాను అని తెలియజేసింది. కానీ డైలాగులు చెప్పే విషయం లో మాత్రం రామ్ బాగా హెల్ప్ చేశారని తెలిపింది ఆ తర్వాత తెలుగును అర్థం చేసుకొని చెప్పానంటూ కూడా ఆమె తెలియజేసింది. ప్రస్తుతం ఈ సంగతి బాగా మాత్రం వైరల్ గా మారింది.