Site icon NTV Telugu

Sudheer Babu: ఆ అమ్మాయి గురించి సుధీర్ బాబు చెప్పేది ఎప్పుడంటే….

Sudheer Babu

Sudheer Babu

 

సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాల తర్వాత సుధీర్ బాబు నటిస్తున్న మూడో చిత్రమిది. బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సుధీర్ బాబు సరసన కృతీశెట్టి నాయికగా నటిస్తోంది. విశేషం ఏమంటే… ఈ యేడాది ఆమెకు ఇది నాలుగో సినిమా. ఇప్పటికే ‘బంగార్రాజు, ది వారియర్’ చిత్రాలు విడుదల కాగా, ఈ నెల 12న ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. సెప్టెంబర్ 16న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. తన సోషల్ మీడియా అక్కౌంట్ లో సుధీర్ బాబు సైతం పోస్ట్ పెడుతూ, ”అనగనగా ఒక అమ్మాయి…. మిగతా కథ, మా ఇద్దరి కథ… ఈ అబ్బాయి సెప్టెంబరు 16న చెబుతాడు” అని పేర్కొన్నాడు. మరి ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Exit mobile version