NTV Telugu Site icon

Mythri Movies Makers: రవితేజ-గోపీచంద్ మలినేని సినిమా గదర్ హీరో చేతికి?

Raviteja

Raviteja

వీరసింహారెడ్డితో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన మాస్ డైరెక్టర్ గోపించద్ మలినేని… నెక్స్ట్ ప్రాజెక్ట్‌ మాస్ మహారాజా రవితేజతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత… నాలుగోసారి ఈ క్రేజి కాంబినేషన్ వర్కౌట్ అవడంతో అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెరిగిపోయాయి కానీ గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బడ్జెట్‌ అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వడం వల్ల… మైత్రీ మూవీ మేకర్స్‌ #RT4GM ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టినట్టుగా టాక్ నడుస్తోంది. అసలు మైత్రీ మూవీ మేకర్స్‌ అనౌన్స్ చేసి… ఈ సినిమాను హోల్డ్ చేయడం ఏంటి? రవితేజ సినిమాకి బడ్జట్ ఇష్యూస్ ఏంటి అనేది రవితేజ అభిమానులకి అంతుబట్టని విషయంగా మారింది.

#RT4GM ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టడం గురించి మైత్రీ మూవీ మేకర్స్ నుంచైతే ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కానీ ఫిల్మ్ నగర్ వర్గాల్లో మాత్రం ఈ సినిమాను మరో హీరోతో ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలే గదర్ 2 సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సన్నీ డియోల్ తో ప్రాజెక్ట్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్, గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం సన్నీ డియోల్ హీరో అయితే బడ్జట్ విషయంలో జరగాల్సిన మార్పులు గురించి లెక్కలు వేసే పనిలో ఉన్నారు మేకర్స్. అన్నీ కుదిరితే త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అయితే గోపీచంద్ మలినేని-సన్నీ డియోల్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే కథ రవితేజ కోసం రాసుకున్న కథేనా కాదు అనేది మైత్రీ మూవీస్ నుంచి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

Show comments