NTV Telugu Site icon

Naveen Polishetty: ‘జల్సా’ టికెట్స్ కావాలా.. నన్ను అడగండి అంటున్న జాతిరత్నం

Pawan

Pawan

Naveen Polishetty: ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నవీన్ పోలిశెట్టి. మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన నవీన్ ఆ తరువాత జాతిరత్నాలు సినిమాతో ఆ విజయాన్ని కొనసాగించాడు. ప్రస్తుతం ముచ్చటగా మూడో సినిమ అనుష్క శెట్టితో చేస్తున్నాడు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే నవీన్, పవన్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. జల్సా బాల్కనీ టికెట్స్ కావాలంటే తనను అడగండి అంటూ చెప్పుకొచ్చాడు. రేపుపవన్ బర్త్ డే సందర్భంగా నేడు జల్సా సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం విదితమే. దాదాపు 500 కు పైగా స్క్రీన్స్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే ఎంత హైప్ ఉంటుందో జల్సా సినిమా రిలీజ్ కు కూడా అంతే హైప్ వచ్చింది.

ఇక ఈ నేపథ్యంలోనే జాతిరత్నం సినిమాలోని ఒక సీన్ ను నెటిజన్లు వైరల్ గా మార్చేశారు. నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతో మాట్లాడుతూ “మీకేం చేయలేదారా.. మార్చి 27, 2008.. నటరాజ్ థియేటర్ సంగారెడ్డి.. జల్సా సినిమా రిలీజ్.. నేను బాల్కనీలో ఉన్నా.. మీరు నేలలో ఉన్నారు.. మిమ్మల్ని పైకి తీసుకురాలేదా.. అది నా నేచర్ మామ” అంటూ సాగే డైలాగ్ ను నేడు వ్ ట్రెండ్ గా మార్చేశారు. ఇక ఈ వీడియోపై నవీన్ స్పందిస్తూ “నటరాజ్ థియేటర్ సంగారెడ్డి.. జల్సా సినిమా రిలీజ్. నేను రెడీ.. బాల్కనీ టికెట్స్ కావాలంటే నన్ను అడగండి.. మిమ్మల్ని పైకి తీసుకొస్తా.. అది నా నేచర్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక పవన్ ఫ్యాన్స్.. అన్నా మాకు టికెట్స్ అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.

Show comments