NTV Telugu Site icon

Ravanasura: సైలెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి!

Ravi

Ravi

Raviteja: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా, రవితేజ ఈ మూవీని నిర్మించారు. సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయ ప్రకాష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 7న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ 15 మిలియన్ వ్యూస్ ను దాటేసింది.

ఇదిలా ఉంటే… ‘రావణాసుర’ మూవీ సెన్సార్ కార్యక్రమాలను సైలెంట్ గా కానిచ్చేశారని తెలుస్తోంది. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ను చూస్తే కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. ‘రావణాసుర’ మూవీకి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చినట్టు పోస్టర్ లో రైట్ సైడ్ కార్నర్ లో చిన్నగా ఉంది. రవితేజ చిత్రాలకు సహజంగా యు/ఎ సర్టిఫికెట్ వస్తుంటుంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు రవితేజ సినిమాలు చూడటానికి చిన్నపిల్లలు సైతం ఇష్టపడుతుంటారు. దాంతో సహజంగా మేకర్స్ ‘యు/ఎ’ సర్టిఫికెట్ కోసమే పట్టుబడతారు. కానీ ఇప్పుడు ‘రావణాసుర’కు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారంటే… ఇందులో మాస్ ను దృష్టిలో పెట్టుకుని యాక్షన్ ఎపిసోడ్స్ ను భారీగా చిత్రీకరించి ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. క్రిమినల్ లాయర్ గా నటించిన రవితేజ… పూర్వాశ్రమంలో క్రిమినల్ కూడా అనే విషయం ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది. భీమ్స్ సిసిరోలియో పాటలకు స్వర రచన చేయగా, హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.