Site icon NTV Telugu

సమంతకు యశ్ రాజ్ ఫిలిమ్స్ బంపర్ ఆఫర్!

Samantha

Samantha

దక్షిణాది స్టార్ హీరోయిన్స్ లో సమంత ఒకరు. నాగచైతన్యతో విడాలకులు తీసుకున్న తర్వాత నటిగా మరింత బిజీ అయ్యారామె. ప్రస్తుతం సమంత చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి సామ్ నటించిన తమిళ చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక గుణశేఖర్ ప్యాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసుంది. శివలెంకకృష్ణప్రసాద్ నిర్మిస్తున్న మరో ప్యాన్ ఇండియా సినిమా ‘యశోద’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అంతే కాదు ఫిలిప్ జాన్ దర్శకత్వంతో హాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఇవ్వనుండటం గమనించదగ్గ అంశం.

Read Also : స్కామ్‌స్టర్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తా… డైరెక్టర్ వార్నింగ్

ఇదిలా ఉంటే సమంత ఇప్పుడు బాలీవుడ్ లోనూ తనదైన ముద్రవేయబోతోంది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో ఉత్తరాదిలోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది సమంత. దాంతో సమంతను తాజాగా ఓ బంపర్ ఆఫర్ పలకరించింది. బాలీవుడ్‌లో అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన యష్ రాజ్ ఫిల్మ్స్ సమంతతో సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఒకేసారి మూడు సినిమాలు చేయమని సమంతను అడిగిందట. ఈ సూపర్ ఆఫర్ కి సమంత కూడా సానుకూలంగా స్పందించినట్లు వినికిడి. అంతే కాదు మరో వెబ్ సిరీస్‌లో కూడా నటించటానికి సామ్ అంగీకరించింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ తర్వాత రాజ్ డికె సమంతతో ‘సిటాడెల్’ అనే సిరీస్ రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. మరి రాబోయే ఈ వరుస ప్రాజెక్ట్ లతో సమంత ఇంకెంతగా ఎదుగుతుందో చూడాలి.

Exit mobile version