Site icon NTV Telugu

Evergreen Club 80 : 80’S రీ యూనియన్.. తళుక్కుమన్న స్టార్స్ ను చూశారా..

80s South Stars Reunite

80s South Stars Reunite

80లలో దక్షిణ భారత సినిమా రంగంలో వెలుగులు నింపిన స్టార్‌ల బృందం ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. వెండితెరపై చేసిన వారి ప్రదర్శనలు మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితాల్లో నిజమైన స్నేహాన్ని ప్రాధాన్యం ఇచ్చిన వారు అభిమానులకి చాలా ఇంపాక్ట్ ఇచ్చారు. ఆ స్నేహాన్ని కొనసాగిస్తూ వారు “ఎయిటీస్ క్లబ్” లేదా “ఎవర్‌గ్రీన్ క్లబ్ 80” అనే క్లబ్ కూడా ప్రారంభించారు, ఇది 80ల స్వర్ణయుగపు స్టార్‌ల స్నేహ బంధానికి గుర్తుగా నిలుస్తోంది.

Also Read : Alia Bhatt : డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి అసలు కారణం షేర్ చేసిన అలియా భట్ ..

తాజాగా ఎప్పటి లాగానే గెట్ టు గెదర్ అయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినీ పరిశ్రమల నుంచి ప్రముఖులు ఒకేచోట కలసి, తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నరేశ్, మీనా, జాకీ ష్రాఫ్, శరత్‌కుమార్, నదియా, రాధ, సుహాసిని, రమ్యకృష్ణ, జయసుధ, సుమలత, ఖుష్బూ, లిస్సీ, శోభన, మేనక, సురేశ్, జయరామ్, అశ్వితి జయరామ్, సరిత, భాను చందర్, మేనక, లత, స్వప్న, ప్రభు, రెహ్మాన్, రేవతి తదితరులు పాల్గొన్నారు. ఈసారి రీయూనియన్ థీమ్‌గా “చిరుత థీమ్”ను ఎంచుకున్నారు. అందరూ చీతా ప్రింట్ ఉన్న డ్రెస్సుల్లో మెరిసి, ఫోటోలతో సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టించారు.

దీంతో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేసి, తన ఆనంద క్షణాలు పంచుకున్నారు “80ల నా ప్రియమైన స్నేహితులతో ప్రతి ఏడాది కలిసే క్షణాలు, నవ్వులు, జ్ఞాపకాలు ప్రతీసారి కొత్తలా అనిపిస్తాయి. నా ప్రియమైన స్నేహితులను కలవడం జీవితానికి రిఫ్రెష్ లాంటి ఫీలింగ్ ఇస్తుంది” అని చెప్పారు. ఈ క్లబ్ ఎలా మొదలయిందంటే, 2009లో సుహాసిని మరియు లిస్సీ చెన్నై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా ఒక చిన్న చర్చ కోసం కలిసారు. ఆ చిన్న సమావేశం చివరికి ఈ ప్రతిష్టాత్మక క్లబ్ స్థాపనకు పునాది వేసింది. ఇప్పుడు 80ల తారల ఈ స్నేహ బంధం అభిమానులకు నోస్టాల్జిక్ క్షణాలను పంచుతూ సోషల్ మీడియాలో మళ్లీ హైలైట్‌గా మారింది.

 

Exit mobile version