National Film Awards: చివరి నిమిషంలో షాక్.. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Film Awards : భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం శక్రవారం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ప్రకటించాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఆ ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఉదయం నుంచే అవార్డుల కోసం ఎదురుచూస్తున్న సినీ వర్గాలకు నిరాశ ఎదురైంది. ముఖ్యంగా వాయిదాకు గల కారణాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ వెల్లడించకపోవడం, కొత్త తేదీని కూడా ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రతి ఏడాది భారతీయ సినిమా ప్రతిభను గుర్తించే అత్యున్నత పురస్కారాలుగా గుర్తింపు పొందాయి. ప్రాంతీయ భాషల నుంచి హిందీ వరకు వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభను ఈ అవార్డుల ద్వారా సత్కరిస్తారు. ఈసారి కూడా పలు భాషల్లో విడుదలైన భారీ చిత్రాలు అవార్డుల రేసులో ఉండటంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి విడుదలైన ‘కల్కి 2898 AD’, ‘దేవర’, మలయాళ చిత్రాలైన ‘బ్రహ్మయుగం’, ‘మంజుమ్మెల్ బాయ్స్’ వంటి సినిమాలు పలు విభాగాల్లో బలమైన పోటీదారులుగా నిలిచాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
ఈ ఏడాది అవార్డుల ఎంపిక కోసం ప్రముఖ దర్శకుడు జయరాజ్ అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడిన జ్యూరీ కమిటీ పనిచేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ధ్రువీకరించిన వందలాది చిత్రాలను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, వివిధ విభాగాల్లో విజేతలను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రకటన వాయిదా పడటం సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ ఆలస్యానికి గల అసలు కారణంపై అధికారికంగా ఎలాంటి వివరణ రాలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు విజేతల ఎంపికపై తుది స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని భావిస్తుండగా, మరికొందరు పరిపాలనా కారణాల వల్లే ప్రకటన వాయిదా పడిందని అభిప్రాయపడుతున్నారు. అయితే వీటిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ధారణ లేదు.
సాధారణంగా జాతీయ అవార్డుల ప్రకటన రోజున సినీ అభిమానులు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఎంతో ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురుచూస్తారు. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపించింది. కానీ చివరి నిమిషంలో వచ్చిన వాయిదా ప్రకటనతో సోషల్ మీడియాలో నిరాశ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈసారి దక్షిణాది సినిమాలు సత్తా చాటతాయనే అంచనాలు ఉండటంతో ఆసక్తి మరింత ఎక్కువైంది. ప్రస్తుతం అందరి దృష్టి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోయే తదుపరి అధికారిక ప్రకటనపైనే ఉంది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు ఎప్పుడు ప్రకటిస్తారు? ఏ సినిమాలు, ఏ నటీనటులు ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకుంటారు? అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే కేంద్ర సమాచార ప్రసార శాఖ నుంచి కొత్త తేదీ ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!