NTV Telugu Site icon

Naatu Naatu: ఆ నలుగురు… ది క్రియేటర్స్ ఆఫ్ మైటీ ‘నాటు నాటు’

Naatu Naatu

Naatu Naatu

‘నాటు నాటు’ సాంగ్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఇండియాకి ఆస్కార్ ని తెచ్చింది. ఈరోజు ఇండియా మొత్తం నాటు నాటు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సంధర్భంగా ఒక ఫోటో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫోటోలో రాజమౌళి, ప్రేమ్ రక్షిత్, చంద్రబోస్, కీరవాణిలు ఉన్నారు. నాటు నాటు సాంగ్ అంత స్పెషల్ గా మారడానికి కారణం ఈ నలుగురే. కీరవాణి ఇచ్చిన సూపర్బ్ ట్యూన్, చంద్రబోస్ రాసిన క్యాచీ లిరిక్స్… రామ్ చరణ్-ఎన్టీఆర్ లాంటి డాన్సర్స్ తో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్, రాజమౌళి విజన్ అన్నీ కలిసి నాటు నాటు సాంగ్ ని ఈరోజు వరల్డ్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా చేశాయి. నాటు నాటు హుక్ స్టెప్ లేకపోయినా, నాటు నాటు అనే హుక్ లైన్ లేకపోయినా ఈరోజు ఈ పాట ఇంత దూరం వచ్చి అవార్డ్ గెలిచేది కాదు. సముద్రాలు దాటి ఆస్కార్ అవార్డ్ గెలిచిన నాటు నాటు సాంగ్ విషయంలో ఈ నలుగురి కాంట్రిబ్యూషణ్ అత్యంత ముఖ్యమైనది. ఈ నలుగురితో పాటు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కూడా నాటు నాటు అంత బ్యూటీఫుల్ గా రావడానికి క్రియేటివ్ వర్క్ చేశారు.