NTV Telugu Site icon

Kiara Advani: 3 రోజులు, 3 సినిమాలతో కియారా బిజీ బిజీ

Kiyara

Kiyara

Kiara Advani: బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ బిజీ బిజీగా సాగుతోంది. పవర్-ప్యాక్డ్ లైన్ అప్ లో పూర్తిగా బిజీగా ఉన్న కియారా అద్వానీ ఓ సినిమా షెడ్యూల్‌ను పూర్తి చేసి, మరో చిత్రం ట్రైలర్‌ లాంచ్ చేసి, ఇంకో సినిమా షూటింగ్‌కి రెడీ అయింది. ఇలా వరుసగా మూడు రోజుల్లో మూడు సినిమాలతో హల్ చల్ చేస్తోంది కియారా. ‘సత్యప్రేమ్ కి కథ’ ముంబై, అహ్మదాబాద్ షెడ్యూల్ తర్వాత, కియారా మ్యూజికల్ రొమాంటిక్ సినిమా రాజ్‌కోట్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. శనివారం ఈ షూట్‌ని ముగించిన కియారా, ఈ ఏడాది విడుదల కాబోతున్న తన మూడో సినిమా ‘గోవింద నామ్ మేరా’ ట్రైలర్ లాంచ్‌కి హాజరయ్యేందుకు ఆదివారం ముంబైకి వచ్చింది. ట్రైలర్ లాంచ్ తర్వాత మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా గడిపిన కియరా రామ్ చరణ్‌, శంకర్ సినిమా పాటల షెడ్యూల్ కోసం సోమవారం ఉదయం న్యూజిలాండ్‌కు బయలుదేరింది. ఈ సంవత్సరం మూడు సినిమాల రిలీజ్ ఉన్న అతి కొద్ది మంది నటీనటులలో కియారా అద్వానీ కూడా చేరింది. ‘షేర్షా’ తో అందరి ప్రశంసలు అందుకున్న కియారా అద్వానీ ‘భూల్ భూలయ్యా 2, జగ్‌జగ్ జీయో’ సినిమాలతో వరుస విజయాలు అందుకుంది. ఇప్పుడు అదే ఊపులో ‘గోవింద నామ్ మేరా’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. వచ్చే నెలలో డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో ఈ సిఇనిమ విడుదల కానుంది. ఆ తర్వాత ‘సత్యప్రేమ్ కీ కథ’ రామ్ చరణ్ సినిమాలు వరుసగా విడుదల అవుతాయి.