Site icon NTV Telugu

Yashoda : సమంత కోసం 7 స్టార్ హోటల్… కోట్లలో ఖర్చు

Samantha

“పుష్ప : ది రైజ్‌” సాంగ్ లో చివరిసారిగా కనిపించిన సమంత పలు భారీ బడ్జెట్ చిత్రాలను లైన్ లో పెట్టింది. వాటిలో “యశోద” కూడా ఒకటి. సమంత హీరోయిన్ గా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ హరి, హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

Read also : Rana Daggubati : అర్జున్ ప్రసాద్ నుంచి డేనియల్ శేఖర్… 12 ఏళ్ళు

ఈ బహుభాషా చిత్రం కోసం భారీ సెట్ ను నిర్మించారట మేకర్స్. “యశోద” కోసం దాదాపు రూ. 3 కోట్ల రూపాయలతో అద్భుతమైన భారీ సెట్‌ను నిర్మించారు. విలాసవంతమైన సెవెన్ స్టార్ హోటల్ సెట్‌ని నిర్మించగా, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సెట్స్ చూసిన నెటిజన్లు ఒక్క సెట్ కే కోట్లు కుమ్మరిస్తే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోనని ఆలోచిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీని చూసుకోనున్నారు. మరోవైపు సమంత “శాకుంతలం” చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version