ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ డ్రామా… ఐయండిబిలో 9.1 రేటింగ్… తెలుగులోనూ చూడచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Romantic Movie OTT : ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరిని ఒకరు ఇష్టపడటం కాదు. అది ఒక ఎమోషనల్ ప్రయాణం. అది మనలోని భయాలను, ఆశలను, జీవితంపై ఉన్న సందేహాలను కూడా బయటకు తీసుకొచ్చే అనుభవం. అలాంటి కంటెంట్ తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న రొమాంటిక్ డ్రామా మూవీ ‘29’. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్కు వస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ఈ మూవీ ఐయండిబి 9.1 రేటింగ్ సాధించడం విశేషం.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్
2026 మే 8న ఈ మూవీ థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు జూన్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. ’29’ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుండటం విశేషం. దీంతో దక్షిణాది ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు ఈ సినిమా మరింత చేరువ కానుంది. ఈ చిత్రానికి రత్న కుమార్ దర్శకత్వం వహించగా, వైట్ కార్పెట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కార్తీక్ సుబ్బరాజు, కార్తికేయన్ సంతానం, లోకేష్ కనగరాజు కలసి నిర్మించారు. విధు ప్రధాన పాత్రలో నటించగా, ప్రీతి అస్రాని కథానాయికగా కనిపించింది. ఇక ఈ జంట నటన ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు.
Also Read
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణీ'.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
- Ranabaali Trailer: 'రణబాలి' ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
‘29’ కథ ఏమిటంటే ?
సత్య అనే 29 ఏళ్ల యువకుడి చుట్టూ సినిమా తిరుగుతుంది. అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేసిన అతడు చెన్నైలో ఉద్యోగం చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. కుటుంబంతో ముఖ్యంగా తన తల్లితో విభేదాల కారణంగా స్నేహితులతో కలిసి నివసిస్తాడు. జీవితంలో ఏదో సాధించాలని తపనపడుతూనే తన అసలు వ్యక్తిత్వం ఏమిటి అనే ప్రశ్నతో నిరంతరం పోరాడుతుంటాడు. అతని మనసులో వినిపించే ఆలోచనలు, సందేహాలు అతడిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి.
ఇలాంటి సమయంలో విజయలక్ష్మి అనే యువతి అతని జీవితంలోకి అడుగుపెడుతుంది. ఆమె రాకతో సత్య జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. మొదట ప్రేమగా ప్రారంభమైన ఈ బంధం క్రమంగా జీవితంలోని బాధ్యతలు, భయాలు, నిర్ణయాల ముందు పరీక్షకు గురవుతుంది. ఈ చిత్రంలో మరో ఆసక్తికర అంశం సత్య మైండ్ వాయిస్‌కు ప్రత్యేక పాత్ర రూపం ఇవ్వడం. అతని ఆలోచనలను, భయాలను ప్రేక్షకులకు దగ్గర చేసే ప్రయత్నం కథలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నేటి యువత ఎదుర్కొంటున్న రిలేషన్ షిప్ సమస్యలను దర్శకుడు చాలా రియాలిటీగా చూపించారు ఇందులో. అందుకే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!