NTV Telugu Site icon

Bunny Vas: ఆ రోజు నేను అలా చేశాను కాబట్టే నాకు ఇలా జరుగుతుందేమో…

Bunny Vas

Bunny Vas

టోవినో థామస్ నటించిన 2018 మూవీ కేరళలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 15 కోట్ల బడ్జట్ తో రూపొందిన ఈ మూవీ కేరళ రాష్ట్రంలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కింది. జోసఫ్ డైరెక్ట్ చేసిన 2018 కేరళ బాక్సాఫీస్ దగ్గర 150 కోట్లకి పైగా రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీని తెలుగులో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు రిలీజ్ చేసాడు. మే 26న తెలుగు ఆడియన్స్ ముందుకి 2018 వచ్చింది. ప్రమోషన్స్ కూడా ఎక్కువగా చేసే సమయం లేకున్నా 2018 సినిమా ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ తోనే హిట్ టాక్ తెచ్చుకుంది. పాజిటివ్ టాక్ సూపర్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతూ ఉండడంతో 2018 సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాకి తెలుగులో మొదటి రోజు కోటి రూపాయలకి పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో టోవినో థామస్, చిత్ర డైరెక్టర్ జోసఫ్, హీరోయిన్ అపర్ణ బాలమురళి హైదరాబాద్ కి వచ్చి మరీ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. బుకింగ్స్ పెరుగుతూ ఉండడంతో 2018 సాలిడ్ హిట్ అయిపోయినట్లే.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సస్ మీట్ బన్నీ వాసు మాట్లాడుతూ… “2018 ఆగస్టులో కేరళలో వరదలు వచ్చాయి. అదే సమయంలో మా బ్యానర్ నుంచి వచ్చిన గీత గోవిందం సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సమయంలో కేరళలో ఫ్లడ్స్ వస్తున్నాయి, అక్కడ రిలీజ్ చేస్తే ఈ సినిమాని వరదల్లో ఎవరు చూస్తారులే అనుకున్నాను కానీ ఆరోజు నాకు 63 లక్షల షేర్ వసూల్ చేసింది. ఆ కలెక్షన్స్ ని కేరళ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేసాం. ఒకటి అంటారు చూసారా… మనం ఏది ఇస్తే మనకు మళ్లీ అది తిరిగి వస్తుంది అని, ఆరోజు నేను ఇచ్చింది ఈరోజు ఈ రూపంలో తిరిగొస్తుందేమో” అని మాట్లాడాడు. బన్నీ వాసు చెప్పిన మాటలకి ప్రెస్ మీట్ లో ఉన్న అందరూ క్లాప్స్ కొట్టారు. అందుకే అంటారేమో మంచి చేస్తే మంచే తిరిగొస్తాది అని…