Site icon NTV Telugu

1920 Bheemunipatnam: రామోజీ ఫిలిం సిటీలో “1920 భీమునిపట్నం” షూటింగ్!

Bheemunipatnam

Bheemunipatnam

1920 Bheemunipatnam Shooting Started: కంచర్ల ఉపేంద్ర – అపర్ణాదేవి హీరోహీరోయిన్లుగా “1920 భీమునిపట్నం” అనే సినిమా తెరకెక్కుతుంది. ఎన్నో అవార్డు సినిమాలు డైరెక్ట్ చేసిన దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరిగింది. బ్రిటీష్ ప్రభుత్వ పోలీస్ అధికారి పాత్రలో హీరో కంచర్ల ఉపేంద్ర నటిస్తుండగా, స్వాతంత్ర సమరయోధుడు కుమార్తె పాత్రలో హీరోయిన్ అపర్ణ దేవి కనిపించనున్నారు. వీరిద్దరిపై కాంగ్రెస్ వాలంటీర్ల నేపథ్యంలో తీసిన ముహూర్తపు తొలి సన్నివేశానికి చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు క్లాప్ కొట్టారు.

Odela 2: తమన్నా నుంచి ఇలాంటిది ఊహించలేదే.. అలాంటి పాత్రలో అంటే..

ఈ క్రమంలో దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ, “భారత స్వాతంత్ర పోరాట నేపథ్యంలో చక్కటి భావోద్వేగాల మధ్య నడిచే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, పాత్రలన్నీ సహజ సిద్ధంగా ఉంటాయని అన్నారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రేరణగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం, వాటికి ప్రాణప్రతిష్ట చేసే నటీ నటులను ఎంపిక చేసుకున్నాం. మంచి అభిరుచి కలిగిన నిర్మాత ఈ ప్రాజెక్టును చేస్తుండటంతో అద్భుతమైన చిత్రంగా రూపుదిద్దుకుంటుందన్న నమ్మకం ఉందని అన్నారు. ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో యండమూరి ప్రవీణ్, ఘర్షణ శ్రీనివాస్, పవిత్ర లోకేష్, తిలక్, జెన్నీ తదితర పాత, కొత్త నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తుండగా ఎస్.మురళీమోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఇదే చిత్ర ప్రారంభోత్సవంలో ఈ సంస్థ బాలు దర్శకత్వంలో నిర్మించనున్న నూతన సినిమా “విక్రమ్ దాస్” లోగో ఆవిష్కరణ కూడా జరిగింది.

Exit mobile version