Site icon NTV Telugu

18 Pages: హమ్మయ్య… ముంతమసాలాలో అనుపమ ఏం కలిపిందో తెలిసిపోయింది

18 Pages

18 Pages

కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్, అనుపమ కలిసి నటించిన రెండో సినిమా ’18 పేజస్’. సుకుమార్ రైటింగ్స్, గీత ఆర్ట్స్ 2 కలిసి నిర్మించిన ఈ బ్యూటీఫుల్ లవ్ స్టొరీ ఇటివలే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయ్యింది. ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న 18 పేజస్ సినిమా రీసెంట్ గా ‘ఆహా’లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీని థియేటర్స్ లో చూసిన వాళ్లకి, ఒటీటీలో చూసిన వాళ్లకి ఉన్న కామన్ డౌట్ అసలు అనుపమ ముంతమసాలాలో ఏం కలిపి తినింది? దానికి ఏం కలిపితే అంత టేస్ట్ వచ్చింది? అనే క్వేషన్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న రేంజులో వైరల్ అయ్యింది.

Read Also: 18 Pages: అయ్యా..ఆ ముంత మసాలాలో కలిపిన పొడిపేరు చెప్పండయ్యా

సోషల్ మీడియాలో “అయ్యా అయ్యా, ఆ ముంతమసాలాలో అనుపమ ఏం కలిపిందో చెప్పండయ్యా” అంటూ మీమ్స్ కూడా చేశారు. విషయం ఆ రేంజులో వైరల్ అవ్వడంతో 18 పేజస్ ప్రొడ్యూసర్స్, అనుపమ ముంతమసాలాలో ఏం కలిపిందో చూపిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో నిఖిల్, అనుపమ ముంతమసాలాలో కలిపింది ‘పెప్పర్మింట్’ అంటూ రివీల్ చేసేసాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ అవుతుంది. అనుపమ ముంతమసాలా సెక్రెట్ ని రివీల్ చేసేశారు కాబట్టి ఇకపై ఎప్పుడైనా ముంతమసాలాని కొత్త టేస్ట్ తో తినాలి అనుకుంటే పెప్పర్మేంట్ ట్రై చెయ్యండి.

Exit mobile version