16 More People Arrested in Bigg Boss 7 Mob Riots: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫినాలేలో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచి కప్ గెలిచిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట పెద్ద విధ్వంసమే జరిగింది. అమర్దీప్, గీతు రాయల్, అశ్విని శ్రీ వంటి వార్ల కారులను ధ్వంసం చేయడమే కాదు సుమారు 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు దుండగులు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ను హెచ్చరించినా వినకుండా ర్యాలీ చేశాడనే కారణంగా ఇప్పటికే ఆయనను, ఆయన సోదరుడిని పోలీసుల అరెస్ట్ చేశారు. ఇదే కేసులో పల్లవి ప్రశాంత్ ప్రయాణిస్తున్న కారును డ్రైవ్ చేసిన ఇద్దరు డ్రైవర్లను కూడా అరెస్ట్ చేశారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Pallavi prashanth Arrest : దయచేసి నా తమ్ముడిని వదిలేయండి..అంటూ వేడుకున్న అశ్వినిశ్రీ..
ఈ 16 మందిలో నలుగురు మైనర్లు ఉన్నారని చెబుతున్నారు. మైనర్లు మినహా మిగతా 12 మందిని వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరు పరచ నున్నారని తెలుస్తోంది. ఇక ఇదే కేసులో ఉన్న మైనర్ లను జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరు పరచబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని పల్లవి ప్రశాంత్ తరఫున ఆయన న్యాయవాదులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ రోజు బెయిల్ పిటిషన్ పై వాదనలు జరగబోతున్నాయి. పరిస్థితులు బాలేదని పల్లవి ప్రశాంత్ ను అన్నపూర్ణ స్టూడియో వెనుక గేటు నుంచి బయటికి పంపినా సరే తాను గెలిచాను ఎందుకు వెనుక గేటు నుంచి వెళ్ళాలి అని పల్లవి ప్రశాంత్ మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున పరిస్థితి అదుపు తప్పడానికి ఇది కారణమైందని పోలీసులు భావిస్తున్నారు.