Ravi Mohan: తమిళ నటుడు రవి మోహన్ (జయం రవి) పేరు కొంతకాలంగా సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా కెనీషా ఫ్రాన్సిస్‌తో ఆయనకున్న సంబంధంపై గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు రవి మోహన్ తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్, పాప్ సింగర్ కీనస్సా ఫ్రాన్సిస్‌కు తన లేటెస్ట్ మూవీ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా అదిరిపోయే అవకాశం ఇచ్చారు. రవి మోహన్ మొదటిసారి దర్శకత్వం వహిస్తూ, యోగి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ‘యాన్ ఆర్డినరీ మేన్’ (An Ordinary Man) సినిమా నుండి 2026 సెప్టెంబర్ 10న ‘హయ్యర్’ (Higher) అనే ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను కూడా విడుదల చేశారు. ఈ పాటకు కీనస్సా ఫ్రాన్సిస్ సంగీతం అందించడమే కాకుండా, దీనికి దర్శకురాలిగా, ఎడిటర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించడం విశేషం.
గతంలో భార్య ఆర్తితో విడాకుల వివాదం నడుస్తున్న తరుణంలో వీరిద్దరి కాంబినేషన్‌లో మ్యూజిక్ ప్రాజెక్ట్స్ వస్తుండటం కోలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. రవి మోహన్ తో తనకున్న సంబంధంపై వస్తున్న ఆరోపణలను కూడా కీనస్సా ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. తాను ఎవరి ఇల్లు కూల్చలేదని, రవి మోహన్ తన వైవాహిక జీవితంలో మానసిక వేదనను అనుభవిస్తున్నప్పుడు ఒక స్నేహితురాలిగా, థెరపిస్ట్‌గా మాత్రమే అండగా నిలిచానని స్పష్టం చేశారు. సోషల్ మీడియా విమర్శల వల్ల ఒకానొక దశలో చెన్నై వదిలి వెళ్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా క్లోజ్ చేసుకున్నారు. అయితే ఈ వివాదాలన్నింటినీ పక్కనపెట్టి ప్రస్తుతం రవి మోహన్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆన్ ఆర్డినరీ మేన్’ (An Ordinary Man) సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా మారి ‘హయ్యర్’ (Higher) సాంగ్ ద్వారా తన సరికొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టడం విశేషం.
తొలిసారి రవి మోహన్ ‘యాన్ ఆర్డినరీ మ్యాన్’ సినిమాను చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ కథ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి మొదటిసారి విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఎదుర్కొనే వింత పరిస్థితులతో థియేటర్లలో కడుపుబ్బా నవ్వించబోతోంది ఈ మూవీ. సినిమా పనులు దాదాపు పూర్తవుతున్న సమయంలో ప్రమోషన్ కోసం హయ్యర్ పేరుతో ఈ ప్రత్యేక పాటను రూపొందించారు. అయితే కెనీషాను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేయడం ఇప్పుడు ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతోంది.
ఇక రవి మోహన్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన చివరిగా శివకార్తికేయన్‌తో కలిసి ‘పరాశక్తి’లో కనిపించారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామాలో శ్రీలీల, అధర్వ మురళి కూడా కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం రవి మోహన్ చేతిలో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. దాదా ఫేమ్ గణేష్ కె. బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కరాటే బాబు’లో రవి మోహన్ హీరోగా నటిస్తున్నారు. దౌదీ జీవల్, ఆనంది, నాజర్, వి.టి.వి. గణేష్, కె.ఎస్. రవికుమార్, సందీప్ రాజ్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు జీనీ సినిమాలోనూ రవి మోహన్ నటిస్తున్నారు. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. మొత్తానికి నటుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవి మోహన్.. ఇప్పుడు దర్శకుడిగా, తనకు సన్నిహితురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషాతో కలిసి ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి.

