Site icon NTV Telugu

DJ Tillu : ఆహాలో అదరగొడుతున్న టిల్లు… 48 గంటల్లోనే రికార్డు

Dj-Tillu

యంగ్ హీరోహీరోయిన్లు సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జోడిగా నటించిన “డీజే టిల్లు” ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇటీవలే ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ఇటీవలే అరంగేట్రం చేసిన “డీజే టిల్లు” అక్కడ కూడా దుమ్మురేపుతున్నాడు. తెలుగు ఓటిటి ఆహాలో రిలీజ్ అయిన ఈ చిత్రం 48 గంటల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.

Read Also : Radhe Shyam : సెన్సార్ పూర్తి… రన్ టైం ఎంతంటే ?

దీంతో “డీజే టిల్లు”పై ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలకు చిత్రబృందం పొంగిపోతోంది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించారు. శ్రీచరణ్ పాకాల పాటలు, తమన్ అందించిన నేపథ్య సంగీతం “డీజే టిల్లు”ను సూపర్ హిట్ సినిమాగా మార్చడంలో పెద్ద పాత్ర పోషించాయని చెప్పొచ్చు. మొత్తానికి సిద్ధూ జొన్నలగడ్డకు ఆశించిన హిట్ దొరికింది. ఇంకేముంది అట్లుంటది మనతోని అంటున్నారు “డీజే టిల్లు” బృందం.

Exit mobile version