Site icon NTV Telugu

Women Crying : ఆడవాళ్లు ఇంట్లో ఎందుకు ఏడ్వకూడదో తెలుసా?

Womens Crying

Womens Crying

ఆడవాళ్లు ఎంత సంతోషంగా ఉంటే ఇల్లు అంత సంతోషంగా ఉంటుంది అంటూ పెద్దలు చెబుతున్నారు..అందుకే స్త్రీ అంటే ఒక శక్తి స్వరూపిణి అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఒక ఇంట్లో మగవాళ్ళు పుట్టినప్పుడు కంటే ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ ఇంట్లో చాలా సంతోషం మరియు ఆనందం కలుగుతుంది అని అందరూ భావిస్తూ ఉంటారు..ఇక నట్టింట్లో అస్సలు ఏడ్చితే ఆ ఇంటికి శని పట్టుకుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.. అంతేకాదు పురాణాల్లో ఆడవాళ్ల గురించి ఎన్నో విషయాలను చెప్పారు.. ఎప్పుడూ వాళ్ళు సంతోషంగా ఉండాలని పెద్ద వాళ్ళు చెబుతుంటారు..

ఆడవాళ్లు ఇంట్లో ఎంత ఆనందంగా ఉంటే ఆ ఇల్లు అంత సంతోషంగా ఉంటుంది మరియు దానివల్ల దుఃఖాలు, కష్టాలు లేక ఎలాంటి సమస్యలైనా తక్కువగానే ఉంటాయి. అంతేకాకుండా ఆడవారికి చాలా ఓర్పు ఉంటుంది, అందుకే స్త్రీని భూదేవితో కొలుస్తారు అంటే భూమికి ఎంత ఓర్పు ఉంటుందో ఆడవారికి కూడా అంతే ఓర్పు ఉంటుంది అని పెద్దలు ఎక్కువగా చెబుతూ ఉంటారు.. ఇంట్లో సంతోషంగా ఉండాలని ఆడవాళ్లు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు..

అందుకే ఆడవారికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంతో సులువుగా వాటిని దాటుతూ ఉంటారు. కానీ స్త్రీలు ఎప్పుడైతే ఇంట్లో సంతోషంగా ఉండరో, గొడవలు పడుతూ ఉంటారో అటువంటి సమయంలో ఎలాంటి సంతోషాలు ఉండవు. ఎప్పుడైతే స్త్రీ నుండి నెగిటివ్ ఎనర్జీ వస్తుందో అప్పుడు వారికి మాత్రమే కాకుండా ఆ ఇంటికి కూడా మంచిది కాదు. అందుకే ఇంట్లో పెద్దలు ఆడవారు ఏడవడం వల్ల ఇంటికి అరిష్టమని చెబుతూ ఉంటారు.. కాబట్టి స్త్రీలు ప్రతి చిన్న విషయాన్ని మనసుకు తీసుకోకపోవడం మంచిది. పైగా ఎప్పుడైతే మనుషులు ఏడుస్తారో అప్పుడు వారి కన్నీరు వృధా అవుతుంది దాంతోపాటుగా వారి జీవితానికి మరియు మనిషికి కూడా విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఆడవాళ్లు ఏడ్చారంటే దానికి ఎంతో బలమైన కారణం ఉండాలి.. కుటుంబ సంతోషం దృష్టిలో ఉంచుకొని ఆడవాళ్లు ఉంటే మంచిది.. వారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచే బాధ్యత మగవారిదే.. ఇది గుర్తుంచుకోండి..

Exit mobile version