వాతావరణం మారినపుడు.. శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. అది సహజమే అయినప్పటికి … దీంతో మనం అనే రోగాల బారిన పడే అవకాశం లేకపోలేదు. చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, ఫ్లూ వస్తుంటాయి. దీంతో వైరస్ వ్యాప్తి చెంది.. అవి ముక్కు, గొంతు, లంగ్స్ పై ఎఫెక్ట్ చూపిస్తాయి. అయితే చిన్న పిల్లలలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడంతో వారు తొందరగా జబ్బు పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి టైంలో మనం కొన్ని టిప్స్ వాడడంతో వాటిని ఫ్లూ వంటి వాటిని దూరం చేయవచ్చుంటున్నారు నిపుణులు.
Read Also: Investments: అతి చిన్న వయస్సులో ఎమ్మెల్యేగా గెలిచిన మిథాలీ ఠాకూర్ ఆస్తులెంతో తెలుసా..
చలికాలంలో వాతావరణంలో మార్పులతో ఎన్నో రకాల వైరస్ లు మనం శరీరంలోకి వెళతాయి. దీంతో మనం తొందరగా రోగాల బారిన పడతాం. అయితే ఎక్కువగా.. జలుబు, గొంతు నొప్పి..ఊపిరితిత్తులపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే వీటి నుంచి మనం రిలాక్స్ అవ్వాలంటే.. గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి రోజుకు మూడు సార్లు గార్గిలింగ్( పుక్కిలించడం) చేయాలి. ఇలా చేయడంతో గొంతు సమస్యలు తక్కువవుతాయి. వైరస్ లు చనిపోయే అవకాశాలు ఉంటాయి.
Read Also:Bride Murder: గంటలో పెళ్లి.. పెళ్లి చీర, డబ్బు విషయంలో వాగ్వాదం.. వధువు హత్య
అయితే దాల్చిన చెక్క, పుదీనా, నిమ్మ, యూకలిప్టస్ ఆయిల్స్ ను వాడడంతో.. శ్వాసకోశ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. రోజుకు రెండు సార్లు హెర్బల్ టీ తాగడంతో పాటు… చేపలు, మాంసం, పప్పు దినుసులు, బీన్స్, సీడ్స్, కోడిగుడ్లు వంటి జింక్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరిగి.. వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మేము ఇంటర్నెట్ ద్వారీ తీసుకున్నాం. కావున మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యేముందు.. వైద్యుల సలహాలు తీసుకుంటే మంచిది.
