Winter Bathing Myths: స్నానం ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమన్న భావన అందరిలోనూ ఉంది. ఉదయం స్నానం చేస్తే శరీరం తేలికగా ఉంటుంది, మనసు ఫ్రెష్‌గా మారుతుంది. కానీ.. చలికాలం వచ్చేసరికి చాలా మందికి స్నానం చేయాలనే ఉత్సాహం తగ్గిపోతుంది. చల్లని గాలి, చల్లటి నీరు శరీరాన్ని వణికిస్తాయి కాబట్టి వేడి నీటిని ఆశ్రయిస్తారు. కానీ ఏ నీటితో స్నానం చేయడం, ఎక్కువసేపు నీటిలో ఉండడం వల్ల చర్మం సహజ రక్షణ పొర బలహీనం కావడం సహజం. ప్రత్యేకంగా శరీరాన్ని తరచూ కడుగుతూ ఉండటం వల్ల బయట నుంచి వచ్చే జీవాణువులకు నిరోధకంగా పనిచేసే సహజ నూనె తగ్గిపోతుంది. పైగా చలికాలంలో చర్మం మరింత పొడిబారే అవకాశం ఉంటుంది.
READ MORE: ఫిక్స్ డ్, టర్మ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా.. అయితే..నియమాలు తెలుసుకోండి
అయితే.. చలికాలం నేపథ్యంలో “స్నానం మానేస్తే ఆయుష్షు పెరుగుతుంది” అని వచ్చే ఓ పరిశోధన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శరీర ఉష్ణోగ్రత తగ్గితే జీవక్రియ నెమ్మదిస్తుంది, ఆక్సీకరణ ఒత్తిడి తక్కువ అవుతుంది, అందువల్ల వృద్ధాప్యం ఆలస్యం అవుతుందని కొన్ని ప్రయోగాలు సూచించాయి. కానీ.. ఇందులో నిజం లేదంటున్నారు నిపుణులు.. ఈ పరిశోధనలన్నీ జంతువులపై చేసిన అధ్యయనలు మాత్రమే అంటున్నారు. మానవులపై ఇదే ప్రభావం ఉంటుందని ఇంకా ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. శీతాకాలంలో స్నానం చేయకపోతే ప్రాణాయుష్షు పెరుగుతుందని వాదనలకు శాస్త్రీయ మద్దతు లేదు.
READ MORE: Jagtial: తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతున్నారని.. కుమారుడు సూసైడ్..
అదే సమయంలో రోజూ స్నానం చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం కూడా పెరిగింది. అవును స్నానం పట్ల భయం అవసరం లేదు.. అలానే అధిక శ్రద్ధ కూడా అవసరం లేదు. రోజంతా బయట తిరిగే వారు, ఎక్కువగా చెమట పట్టే వారు, శారీరక శ్రమ చేసే వాళ్లు తరచూ స్నానం చేయవచ్చు. కానీ ఇంట్లోనే ఉండే వారు లేదా పొడి వాతావరణంలో ఉన్నవారు రోజూ సబ్బుతో శరీరాన్ని రుద్ది కడగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చలికాలంలో శరీరాన్ని శుభ్రంగా ఉంచడం, చర్మాన్ని తడిగా ఉంచడం, సరైన నీటి ఉష్ణోగ్రతతో త్వరగా స్నానం చేయడం చాలు. అందుకే స్నానాన్ని ఆరోగ్యానికి శత్రువుగా కాకుండా, శరీర స్వభావం ప్రకారం పాటించాల్సిన సహజ అలవాటుగా చూడాలి.
READ MORE: Jagtial: తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతున్నారని.. కుమారుడు సూసైడ్..
స్నానం చేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తులు ఉన్నాయి.. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతిరోజూ శరీరాన్ని గట్టిగా రుద్ది కడగడం వల్ల చర్మం మీద ఉండే మేలైన బ్యాక్టీరియా తగ్గిపోతాయి. ఈ సూక్ష్మజీవులు చర్మాన్ని రక్షించడమే కాకుండా రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే ఈ సమస్య మరింత పెరుగుతుంది. చర్మం పగుళ్లు పడటం, ఎర్రగా మారటం, ఇన్ఫెక్షన్లకు లోనయ్యే అవకాశం ఉంటుంది.
