Site icon NTV Telugu

Relationship : భర్తను ఎక్కువగా ఇష్టపడుతున్నారా..? ఒక్కసారి ఇది చూడండి..

Wife Husband

Wife Husband

భార్యా భర్తల్లో ఒకరిపై మరొకరికి ప్రేమ ఉండటం సహజం.. అతిగా ఆశించడం వల్ల జరిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఏ భార్య భర్తలకైనా తన భాగస్వాముల నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి.. భార్య కి భర్త తన కోసం బహుమతులు కొనాలని, బాగా చూసుకోవాలని ఉంటుంది. అలాగే భర్తకి కూడా భార్య తన మాటను వినాలి అని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.. ఇలాంటి ఆశలు కూడా మితి మీరడం వల్లే గొడవలు కూడా వస్తాయి.. మనిషికి ఆశ అనేది ఉండొచ్చు భార్య ఒక వంద బహుమతులు అడిగితే మితిమీరిన ఆశ అంటారు. కానీ అందులో కనీసం ఒక పదైనా భర్త తీర్చగలిగితే అది ఆ భార్యకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది..

సాదారణంగా భార్య కు భర్త తన కోసం బహుమతులు కొనాలని, బాగా చూసుకోవాలని ఉంటుంది. అలాగే భర్తకి కూడా భార్య తన మాటను వినాలి అని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.. అయితే ఎక్స్పెక్టేషన్స్ మితిమీరడం వల్ల భార్య భర్తల మధ్య గొడవలు కూడా రావచ్చు.మనిషికి ఆశ అనేది ఉండొచ్చు భార్య ఒక వంద బహుమతులు అడిగితే మితిమీరిన ఆశ అంటారు. కానీ అందులో కనీసం ఒక పదైనా భర్త తీర్చగలిగితే అది ఆ భార్యకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.. కొన్ని కుటుంబాలలో ఇది ఇలాగ నడవగా మిగిలిన కుటుంబాలలో ఈ ఆశలే గొడవలకి దారితీస్తాయి. భార్య, భర్త నుంచి ఏదో ఆశిస్తుంది కానీ భర్త అది ఇవ్వలేకపోతాడు. దీనివల్ల మనస్పర్ధలు వచ్చి ఒకరి మీద ఒకరికి ద్వేషం కలుగుతుంది. ఆ కారణం చేత మనం బంధాలని వదులుకోలేము..

ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు.మనకి బంధం కావాలంటే ఆ ఆసలు వదులుకోవడం మేలు. లక్క, బంగారం రెండూ ఒకటి కాదు కానీ లక్క లేకపోతే బంగారం వంగిపోతుంది.. భార్యాభర్తల బంధంలో కూడా ఈ మాట వర్తిస్తుంది. దంపతులు మధ్య ఎన్ని గొడవలు వచ్చినా సరే ప్రేమ అనే ఒక్క పదం కోసం వాళ్లు జీవితంలో ముందుకు సాగుతూనే ఉండాలి.. ఎందుకంటే ఎంత ఆశపడినా భార్య కాని భర్త కాని ఆ కోరికని తీర్చలేనప్పుడు ఆశపడి బాధపడడం కన్నా ఆశపడకుండా ఉండడమే మేలు.. ఇలాంటి ఆశలు వదులుకోవడం మేలు.. అలాగని అన్ని వదిలేస్తే అందరి దృష్టిలో చీప్ అయిపోతారు.. ఏదైనా బంధం ఉన్నంతవరకే.. ఇది గుర్తుపెట్టుకోండి..

Exit mobile version