NTV Telugu Site icon

lizard: బల్లి కరిస్తే ఏం జరుగుతుంది? బల్లి పడిన ఆహారం తింటే ప్రమాదమా?

Lizard

Lizard

గోడమీద బల్లి మన శరీరంపై పడితే.. తాకితే చాలా మంది భయపడి పోతుంటారు. బల్లి విషపూరితమైన కూడా నమ్మకం ఉంది. అది మనపై పడినా లేదా తాకినా వెంటనే స్నానం చేయాలని పెద్దలు చెబుతుంటారు. అది కరిస్తే.. చాలా ప్రమాదమని.. చనిపోవచ్చని చెబుతుంటారు. బల్లి శరీరం నుంచి విషాన్ని విడుదల చేస్తుందని.. ఒక వేళ అది పడిన ఆహారం తింటే చాలా ప్రమాదమని భావిస్తుంటారు. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

బల్లి ఆహారంలో విషాన్ని వదులుతుందా?
నిజానికి బల్లుల చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి. అవి ఎదురైతే మంచిది కాదని, అపశకునమని అని కొందరు భావిస్తుంటారు. కొందరు మాత్రం లైట్ తీసుకుంటారు. ఆహారంలో బల్లి పడితే, అది విషపూరితం అవుతుందని కూడా చెబుతారు. కానీ.. బల్లి పడినంత మాత్రాన ఆహారం విషపూరితం కాదని.. నిజానికి బల్లుల్లో మనషులను చంపేంత విషం ఉండదట. పరిశోధనలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. అయితే, ఒక్కోసారి బల్లి పడిన ఆహారాన్ని తీసుకుంటే వాంతులు, తలనొప్పి లాంటివి కలగొచ్చు. ఇవన్నీ అలర్జీ వల్లే వస్తాయి. ఈ లక్షణాలను మందులతో మనం తగ్గించుకోవచ్చు. ఈ విషయంలో మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరముంది.

బల్లి కరిస్తే ఏం జరుగుతుంది?
సాధారణంగా ఇళ్లలో కనిపించే బల్లులు విషపూరితమైనవి కావు. అలాగే వాటి చర్మం నుంచి బయటకు విషం రాదు. షపూరితమైనప్పటికీ, అవి ఎక్కువగా అడువుల్లో కనిపిస్తాయి. ఇళ్లల్లో మాత్రం కాదు. ఇళ్లల్లో కనిపించే బల్లులు సాధారణంగా కీటకాలను తినడం ద్వారా కడుపు నింపుకుంటాయి. వీటి వల్ల మనుషులకు ఎలాంటి ముప్పు ఉండదు. అయితే.. బల్లులు పరాన్నజీవులు. బ్యాక్టీరియాల్ని మోసుకెళ్లగలవు. దీంతో అవి సంక్రమణకు కారణమవుతాయి. బల్లుల మలం చాలా ప్రమాదం. ఆ మలాన్ని ఇంటి నుంచి నివారించాలి. ముఖ్యంగా బల్లి కాటు డేంజర్ అని గమనించాలి. అందుకే బల్లి కుడితే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బల్లి కుడితే.. భయాందోళనలకు గురికాకుండా కొన్ని చికిత్సలు చేసుకోవాలి. కుట్టిన చోటును శుభ్రమైన నీటితో కడగాలి. సబ్బుతో క్లీన్ చేసుకోవాలి. సెప్టిక్ కాకుండా అందుబాటులో ఉన్న మందు అప్లై చేయండి. పై చికిత్సల తర్వాత కూడా కరిచిన ప్రాంతంలో వాపు, నొప్పి ఉంటే వైద్యుణ్ని సంప్రదించండం చాలా ఇంపార్టెంట్.