NTV Telugu Site icon

Hug day: కౌగిలింతలోని రహస్యలు..

February 7 (69)

February 7 (69)

చాలా మంది సంతోషమైనా, బాధేసినా కౌగిలింతతో మనసులోని భావాల్ని ఎదుటివారితో పంచుకునే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం మంచి అలవాటు. దీని వల్ల మనసులోని భావోద్వేగాలు అదుపులోకి వస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. కానీ ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మెసేజ్‌లు చేసుకోవడం, విషెస్ తెలపడం, ఒకరినొకరు పలకరించుకోవడం అన్ లైన్ లోనే జరిగిపోతుంది. ఎక్కడో ఉన్న వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడి ఎమోషన్స్‌ ఎక్స్‌ప్రెస్ చేసుకుంటున్నాం. అయితే, వేల మాటల కన్నా ఒక్క కౌగిలింత ఎంతో మంచిది. ఫిజికల్ టచ్‌తో వ్యక్తిలోని ఆనందాన్ని రెట్టింపు చేయవచ్చు. బాధను తగ్గించవచ్చు. అంతటి పవర్ ఉండటం వల్ల కౌగిలింతకి కూడా సపరేటుగా ఓ రోజు కేటాయించారు. దానే వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా ఐదో రోజు ఫిబ్రవరి 12న హగ్ డే గా జరుపుకుంటున్నారు.ఇక ఈ రోజు హగ్ డే సందర్భంగా దాని ప్రాధాన్యత, విశేషాలు తెలుసుకుందాం.

మన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసేందుకు కౌగిలింత చక్కటి మార్గం. ఫ్రెండ్‌షిప్, లవ్, కంఫర్ట్‌ని తెలిపేందుకు హగ్‌ చేసుకుంటారు.ఇది కేవలం శారీరక సుఖానికి సంబంధించినది మాత్రం కాదు. ఒక్క హగ్‌తో మానసికంగా, సైకలాజికల్‌గా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. సంప్రదాయ వైద్యంలోనూ కౌగిలింత ఒక మెడిసిన్‌లా పనికొచ్చేదట. కొన్ని రకాల ట్రీట్‌మెంట్స్‌కు వాడే మందులకు బదులుగా, ఒక్క కౌగిలింత ఇచ్చే ధైర్యం మెరుగ్గా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి ఇలాంటి హగ్ లో చాలా రకాలు కూడా ఉంటాయి.

1. ఒక వ్యక్తి మిమ్మల్ని వెనక నుండి హత్తుకున్నారంటే మీ రక్షణ గురించి వాళ్లు ఎంతో నిబద్ధతతో ఉన్నారని అర్థం.. సహజంగా ప్రేమికులు లేదా భార్యాభర్తల్లో ఇలాంటి కౌగిలింతలు ఎక్కువగా కనిపిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మాటల్లో చెప్పలేకపోతున్నా ఓ వ్యక్తి మిమ్మల్ని వెనకాల నుండి గట్టిగా హత్తుకున్నారంటే వారు దేని గురించో మీకు చెప్పాడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. అలాంటప్పుడు వారికి ఏం జరిగింతో ఎలా ఉన్నారో అడిగి తెలుసుకోవాలి.

2. బిగి కౌగిలింతలు గురించి మాట్లాడుకుంటే.. మనకు ఇష్టమైన వ్యక్తిని ఎన్నో రోజుల తర్వాత కలుసుకోవడమో లేక వారిని విడిచి వెళ్లడానికి ఇష్టపడనప్పుడో గట్టిగా కౌగిలించుకుంటారు. దీనినే బేర్‌ హగ్‌ (బిగి కౌగిలింత) అని పిలుస్తుంటారు. ఒక వ్యక్తి మిమ్మల్ని ఇలా గట్టిగా హగ్‌ చేసుకుంటే వారికి మీపై ఎంతో ప్రేమ ఉందని అర్థం చేసుకోవాలి నిపుణులు అంటున్నారు. ఇది కేవలం ప్రేమికులు, భార్య భర్తలు, తల్లీ పిల్లల మధ్య కాకుండా.. స్నేహితులు, బంధువులు మధ్య కూడా ఉంటుంది.

3. ఇక మన ముఖంపై సంతోషం, చిరునవ్వు ఉన్నప్పుడు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడాన్ని పొలైట్‌ హగ్‌ అని పిలుస్తారు. ఇలాంటి కౌగిలింతలు సాధారణంగా స్నేహితులు, పేరెంట్స్‌-పిల్లలకు మధ్య కనిపిస్తుంటాయని అంటున్నారు. ఇలా ఎవరైనా మిమ్మల్ని కౌగిలించుకుంటే ‘నీకు నేనున్నానని భరోసా ఇస్తున్నట్లు’ అర్థం.

4. మనం కౌగిలించుకున్న తర్వాత వీపుపై నిమరడం చూస్తుంటాం. ఇలా హగ్‌ చేసుకుంటున్నారంటే వారు మీ సంరక్షకులని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సహజంగా తల్లిదండ్రులు లేదా పెద్ద వాళ్ళు పిల్లలను ప్రోత్సహిస్తున్న సమయంలో, వారిని ఓదార్చుతున్న సమయంలో ఇలాంటి కౌగిలింతలు సర్వసాధారణం.

5. నడుముపై చేతులు వేసి హగ్‌ చేసుకుంటున్నారంటే వారు.. ప్రేమించాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నరిన రిలేషన్‌షిప్‌ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతారని అభిప్రాయపడుతున్నారు. అంటే వారికి ఒక మనిషిని ఎంచుకోవడంలో క్లారిటి ఉండదు. ఆకర్షన ఎక్కువగా ఉంటుంది. ఉన్న దాని కంటే ఎక్కువ కావలనే ఊహల్లో ఉండిపోతారు.

6. శరీరాలు తాకాకుండా కేవలం బుజాలపై తల వాల్చి, ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేస్తూ ఆలింగనం చేసుకోవడాన్ని లండన్‌ బ్రిడ్జ్‌ హగ్‌ అని పిలుస్తుంటారు. ఇలా కౌగిలించుకునే వారి మధ్య స్వచ్ఛమైన స్నేహబంధం తప్ప మరే బంధం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇది కొంత మందికి అలవాటుడా కూడా ఉంటుంది. బయటికి వెళ్లినప్పుడు అయిన, వచ్చినకా అయిన ఇంట్లో వారికి హగ్ చేసుకుంటు ఉంటారు. దీని లండన్ బ్రిడ్జి హగ్ అని అంటారు.

7. ఒక వ్యక్తి మీ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ హత్తుకున్నారంటే వారికి మీపై అంతులేని ప్రేమ, గౌరవం ఉందని అర్థం. మీతో పీకల్లోతు ప్రేమలో ఉంటేనే ఇలాంటి హగ్‌ ఇస్తారు. శరీరాలు పెనవేసుకుంటూ, కళ్లతో మాట్లాడుకుంటూ ఇచ్చుకునే ఈ హగ్‌.. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తెలుపుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ఎక్కువ భార్య భర్తలు ఇచ్చుకుంటారు. లవర్స్ కూడా ఇచ్చుకుంటారు. కానీ ఈ కౌగిలింత ఎదుటి మనిషి ప్రేమను తెలియజేస్తుంది.ఎంత ప్రేమ ఉందో అనేది ఈ ఒక హగ్ తో చెప్పేయొచ్చు అంటా.