గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఒక రోజుకి 7000 లీటర్లు పంప్ చేస్తుంది. సాధారణంగా మీ ఇంటి నీళ్ళ ట్యాంకు 1000 లీటర్లు. అలాంటి 7 ట్యాంకుల రక్తాన్ని గుండె ఒక్క రోజులో పంప్ చేస్తుంది. ఇందులో 70శాతం మెదడుకి వెళుతుంది. 30శాతం మిగతా శరీర అవయవాలకు వెళుతుంది. గుండె ఒకసారి కొట్టుకోటానికి 0.8 సెకన్ల సమయం పడుతుంది. ఈ 0.8 సెకన్ల సమయంలో 0.3 సెకన్ల సమయం సంకోచించటానికి (contraction), 0.5 సెకన్ల సమయం వ్యాకోచించటానికి (అంటే రిలాక్స్ కావటానికి). ఈ 0.5 సెకన్ల రిలాక్స్ టైమ్ లో రక్తం ఊపిరి తిత్తులకు వెళ్లి శుభ్రపడుతుంది. ఈ రిలాక్స్ టైమ్ తగ్గితే రక్తం సరిగా శుభ్రపడదు.
మీరు టెన్షన్ లో గానీ కోపంతో గానీ ఉంటే ఏమవుతుంది? మీ మెదడుకి ఎక్కువ రక్తం అవసరమవుతుంది. అప్పుడు గుండె తక్కువ రిలాక్స్ అవుతుంది. 0.5 బదులు 0.4 సెకన్ల టైమ్ రిలాక్స్ అవుతుంది. గుండె ఒక బీట్ కి 0.8 కి బదులు 0.3 + 0.4 = 0.7 టైమ్ మాత్రమే తీసుకుంటుంది. నిమిషానికి 84 సార్లు కొట్టుకుంటుంది. గుండెకి విశ్రాంతి (రిలాక్సేషన్) 20% తగ్గుతుంది. రక్తం 80% మాత్రమే శుభ్రపడుతుంది.
Read Also:Janata Dal United: రావడం కుదరదు.. కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించిన జేడీయూ
ఈ అపరిశుభ్రమైన రక్తం మీ మెదడుని మీ శరీర అవయవాలని సరిగా శుభ్రపరచలేకపోతుంది. కనుక కోప్పడవద్దు, టెన్షన్ పడవద్దు. ఇతరుల మీద కోపం, ద్వేషం బదులు మీరు ప్రేమ చూపిస్తే మీ గుండె 72 సార్లు కొట్టుకుని మీ మెదడు ప్రశాంతంగా చురుకుగా ఉంటుంది.గుండె నెమ్మదిగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ బీసీ తక్కువగా ఉంటే… మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది గుర్తుంచుకోండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే.. మీ గుండె పదిలంగా ఉంటుంది. మీ గుండె స్టంట్లు అవసరం లేకుండా స్ట్రెంగ్త్ గా ఉండాలంటే మీరు హాయిగా నవ్వుకోండి. మంచి నవ్వు మీ గుండెకి మంచి ఔషధం.
<p style=”font-size: 10px;”><span style=”color: red;”>నోట్ :</span> ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.</p>