Site icon NTV Telugu

Water Chestnuts Benefits: సింగాడా దుంపలకు మార్కెట్లో భారీ డిమాండ్… కారణం ఇదే!

Untitled Design (8)

Untitled Design (8)

చలికాలంలో దొరికే సింగాడా దుంపలు (Water Chestnuts) ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్‌ను సంపాదించుకుంటున్నాయి. బయటకు నల్లగా బొగ్గుల్లా కనిపించినా, లోపల మాత్రం తెల్లగా, తియ్యగా, పుష్కల పోషకాలు కలిగిన గుజ్జు ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేసే ప్రత్యేక పోషకాలతో నిండి ఉంటాయి.

సింగాడాలు తియ్యగా, కాస్త వగరుగా ఉంటాయి. వీటిని ఉడికించి లేదా కాల్చి తింటారు.  సలాడ్లు, సూపులు, వంటకాలలో కూడా వేస్తారు. ఎండబెట్టిన తర్వాత పిండి చేసి చపాతీలు, లడ్డూలు, కొన్ని కూరల్లో కూడా ఉపయోగిస్తారు.

సింగాడా దుంపల ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు

సింగాడాలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉన్న లారిక్ యాసిడ్ చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.  జుట్టు దట్టంగా పెరగడంలో సహాయపడుతుంది.  క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్, జింక్, కాపర్ వంటి ఖనిజాల వల్ల ఎముకలు బలపడతాయి. దంతాలు దృఢంగా ఉంటాయి. రక్తప్రసరణను నియంత్రణలో ఉంచి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది.

షుగర్ లెవల్స్‌ని స్థిరంగా ఉంచే లక్షణాల కారణంగా డయాబెటిస్ ఉన్నవారు కూడా పరిమితంగా తీసుకోవచ్చు అని న్యూట్రిషన్లు చెబుతున్నారు. మొత్తానికి, అనేక పోషకాలు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో సింగాడా దుంపలకు మార్కెట్లో భారీ గిరాకీ ఉంది. పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా అందించబడింది. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా సలహా కోసం న్యూట్రిషియన్ నిపుణులను సంప్రదించడం మంచిది.

 

 

 

Exit mobile version