NTV Telugu Site icon

Vikas Divyakirti: స్త్రీగా జీవించడం ఎందుకు కష్టం?: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్

Vikas Divyakirti

Vikas Divyakirti

ఐఏఎస్ కోచింగ్ వ్యవస్థాపకుడు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన వికాస్ దివ్యకీర్తి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. పుస్తక పాఠాలు చెప్పడంతో పాటు జీవిత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే మార్గాన్ని కూడా చూపుతున్నారు. తన వైరల్ వీడియోలలోఆయన స్త్రీని కష్టంగా అభివర్ణించారు. స్త్రీల కష్టాలను అర్థం చేసుకోవాలని పురుషులకు సలహా ఇచ్చారు. అంతే కాదు.. పురుషుడు తన బాధ్యతను అర్థం చేసుకోవడానికి స్త్రీ యొక్క కష్టతరమైన జీవితానికి కొన్ని ఉదాహరణలను కూడా చెప్పారు. ఇది తెలుసుకున్న తర్వాత, స్త్రీగా ఉండటం అంత సులభం కాదని మీరు నిజంగా భావిస్తారు.

‘పీరియడ్స్‌ను భరించాల్సిన అవసరం లేదు’
వికాస్ దివ్యకార్తి మాట్లాడుతూ.. “ఈ ప్రపంచంలో స్త్రీగా ఉండటం చాలా కష్టమైన పని. పురుషులు నెలలో 5 రోజులు పీరియడ్స్‌తో బాధపడాల్సిన అవసరం లేదు. ఇది వారి జీవితంలో 16.6 శాతం ఆదా చేసింది.” అని పేర్కొన్నారు. మనం వికాస్ దివ్యకీర్తి మాట అంతరార్థం ప్రకారం.. పీరియడ్స్ సమయంలో స్త్రీలు నిజానికి యాక్టివ్‌గా ఉండరు. కొంతమంది మహిళలు కూడా పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పిని అనుభవిస్తారు. దీని వల్ల వారి చదువులు, ఉద్యోగం, అన్నీ దెబ్బతింటాయి.

పిల్లలను కనడంలో పాత్ర..
వికాస్ దివ్యకీర్తి ఇంకా మాట్లాడుతూ.. “బిడ్డకు జన్మనివ్వడంలో స్త్రీల పాత్రం కీలకం. వారు 9 నెలలు కడుపులో బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతూ.. మోయాల్సి వస్తుంది. పురుషులకు ఈ అవసరం లేదు.” అన్నారు. ఆయన వివరణ ఏంటంటే.. నిజానికి, కొంతమంది మహిళలు వివాహం, గర్భం కారణంగా తమ వృత్తిని మధ్యలోనే వదిలివేయవలసి ఉంటుంది. దీంతో కెరీర్‌లో ఎన్నో సమస్యలు ఎదుర్కుంటారు.

పిల్లవాడు సరిగా చదువుకోకపోతే అది స్త్రీ తప్పు..
“పిల్లవాడు సరిగా చదువుకోడు లేదా ఎదగడు లేకపోతే పురుషులను ఎవరూ నిందించరు. మొత్తం నింద భార్యపై ఉంటుంది. ఎందుకంటే పెంపకం అనేది స్త్రీ యొక్క పని అని అందరూ భావిస్తున్నారు.” అని వికాస్ దివ్యకీర్తి వ్యాఖ్యానించారు. అవును ఇది చేదు నిజం. ఒక కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైనప్పటికీ.. ఇంటిపనులు, పిల్లల పెంపకం బాధ్యత స్త్రీపైనే ఉంటుంది. ఇక్కడ రెండు బాధ్యతలు సమానంగా పంపిణీ చేయబడవు. వనిత బయట కష్టపడి వచ్చినప్పటికీ ఇంటి భారం తప్పదు కదా.. అందుకే వారిని సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడం అవసరం.