Vidura Neeti: జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలా?.. అయితే ఈ 6 అలవాట్లకు వెంటనే గుడ్‌బై చెప్పండి!

Vidura Neeti

Vidura Neeti

Vidura Neeti: మహాభారత కాలం నాటి గొప్ప విద్వాంసుడు, ధృతరాష్ట్రుని మహామంత్రి అయిన మహాత్మా విదురుని నీతులు నాటి కాలంలోనే కాదు, నేటి ఆధునిక యుగంలోనూ అంతే ఖచ్చితంగా సరిపోతాయి. విదుర నీతి అనేది కేవలం ఉపదేశం మాత్రమే కాదు, జీవితాన్ని విజయవంతంగా ఎలా జీవించాలో నేర్పే ఒక ప్రాక్టికల్ ఆర్ట్. ఎవరైనా సరే తమ జీవితంలో ఉన్నతిని, వైభవాన్ని,  సంపదను సాధించాలనుకుంటే.. విదురుని ప్రకారం 6 దుర్గుణాలను వెంటనే వదిలిపెట్టడం ఎంతైనా అవసరమ.  అవి ఏంటో ఇప్పుడు చూద్దా..

విజయ మార్గంలో అడ్డుపడే ఆ 6 అతిపెద్ద అడ్డంకులు ఇవే:

అధిక నిద్ర (Excessive Sleep): విజయ తీరాలకు చేరాలనుకునే వారికి బద్ధకంతో కూడిన నిద్రే అతిపెద్ద శత్రువు. నిరంతర అప్రమత్తత, కష్టపడే తత్వమే మనిషిని విజయ శిఖరాలకు చేరుస్తాయి.

తంద్ర/మగత (Laziness/Drowsiness): ఎప్పుడూ నీరసంగా ఉండటం లేదా పనులను వాయిదా వేసే ప్రవృత్తి మనిషికి వచ్చే మంచి అవకాశాలను దూరం చేస్తుంది. దీనివల్ల ఎదుగుదల ఆగిపోతుంది.

క్రోధం/కోపం (Anger): కోపం అనేది మనిషి ఆలోచనా శక్తిని, విచక్షణను పూర్తిగా నశింపజేస్తుంది. కోపంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలే జీవితంలో ఎదురయ్యే అపజయాలకు ముఖ్య కారణం అవుతాయి.

భయం (Fear): మనసులో ఉండే భయం మనిషిని కొత్త అవకాశాలను అందుకోకుండా అడ్డుకుంటుంది. ఆత్మవిశ్వాసమే విజయానికి అసలైన తాళంచెవి, కాబట్టి భయాన్ని మనసు నుంచి పూర్తిగా తుడిచేయాలి.

ఆలస్యం/బద్ధకం (Procrastination): ఏ పనినైనా రేపు చేద్దాంలే అని వాయిదా వేసే వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేడు. బద్ధకం వల్ల సమయం వృథా అయి, చివరకు పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది.

దీర్ఘసూత్రత (Delayed Execution): చేయాల్సిన పనిని కాకుండా, అవసరానికి మించి ఎక్కువ సమయం తీసుకోవడం అనేది మీ పనితీరుపై, సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. కాలంతో పాటు వేగంగా ముందుకు సాగడమే నిజమైన విజయ రహస్యం.