Tattoo Trends 2026: టాటూ ప్లేస్మెంట్ ఎందుకు ముఖ్యం..? 2026లో మారుతున్న కొత్త ట్రెండ్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tattoo Trends 2026: ఒకప్పుడు టాటూ అంటే అందమైన డిజైన్‌ను ఎంచుకోవడమే ప్రధాన విషయం. కానీ, 2026లో పరిస్థితి పూర్తిగా మారింది. ఇప్పుడు టాటూ డిజైన్‌తో పాటు శరీరంలో ఎక్కడ వేయించుకోవాలనే అంశానికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగం, వ్యక్తిగత జీవితం, ఫ్యాషన్, ఆభరణాలు, దుస్తుల శైలి వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని టాటూ ప్లేస్‌మెంట్‌ను ఎంచుకుంటున్నారని టాటూ ఆర్టిస్ట్ చెబుతున్నారు.. అంటే, గతంలో టాటూ డిజైన్‌ను ఎంచుకున్న తర్వాత ఎక్కడ వేయించుకోవాలనే దానిపై చర్చించేవారు. ఇప్పుడు మాత్రం ముందుగా ప్లేస్‌మెంట్‌ను నిర్ణయించి, దానికి సరిపోయే డిజైన్‌ను ఎంచుకుంటున్నారు. టాటూ అందంగా కనిపించడమే కాకుండా, అది వ్యక్తి జీవనశైలికి కూడా సరిపోవాలని చాలా మంది కోరుకుంటున్నారు.
వేళ్లపై టాటూలు.. చిన్నవైనా ప్రత్యేక గుర్తింపు
వేళ్లపై చిన్న సింబల్స్, అక్షరాలు లేదా ప్రత్యేక గుర్తులు వేయించుకోవడం ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఇవి ఉంగరాలు, నెయిల్ ఆర్ట్‌తో కలిసిపోయి ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌లా కనిపిస్తాయి. చేతులతో మాట్లాడే సమయంలో కూడా ఈ టాటూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే వీటిని దాచడం కష్టం కావడంతో చాలామంది బాగా ఆలోచించి ఈ ప్లేస్‌మెంట్‌ను ఎంచుకుంటున్నారు.
Also Read
- How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
- Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాలర్‌బోన్ టాటూలు.. చూపించాలన్నా, దాచాలన్నా సులువు
కాలర్‌బోన్ ప్రాంతం టాటూలకు అత్యంత అనువైన ప్రదేశంగా మారింది. ఆఫ్‌షోల్డర్ లేదా స్ట్రాపీ దుస్తులు ధరించినప్పుడు టాటూ కనిపిస్తుంది. అవసరమైతే పూర్తిగా కప్పేసుకోవచ్చు. అందుకే ఉద్యోగం చేసే వారిలో ఈ ప్లేస్‌మెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. మెడ డిజైన్‌తో కలిసిపోయేలా ఈ టాటూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
వెన్నెముకపై టాటూలు.. సొగసుకు ప్రతీక
ఫైన్‌లైన్ టాటూలు ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాయి. వెన్నెముకపై నిలువుగా ఉండే కోట్స్, పూల డిజైన్లు లేదా అలంకార టాటూలు శరీర ఆకృతికి మరింత అందాన్ని తీసుకువస్తాయి. బ్యాక్‌లెస్ దుస్తులు ధరించినప్పుడు మాత్రమే ఇవి కనిపిస్తాయి. దీంతో ఎప్పుడు టాటూను చూపించాలనే నిర్ణయం పూర్తిగా వ్యక్తి చేతిలోనే ఉంటుంది.
పక్కటెముకలపై టాటూలు.. వ్యక్తిగత భావోద్వేగాలకు ప్రతిబింబం
పక్కటెముకలపై టాటూ వేయించుకోవడం చాలా నొప్పిగా భావించినప్పటికీ, వ్యక్తిగత జ్ఞాపకాలు, పేర్లు, ముఖ్యమైన తేదీలు వంటి భావోద్వేగాలకు సంబంధించిన డిజైన్లను చాలామంది ఇక్కడే వేయించుకుంటున్నారు. ఈ టాటూలు అందరికీ కనిపించకుండా వ్యక్తిగతంగానే ఉండటంతో వాటికి మరింత ప్రత్యేకత ఏర్పడుతోంది.
చెవి వెనుక టాటూలు.. చిన్నవైనా ప్రత్యేక ఆకర్షణ
జుట్టు వదిలేస్తే కనిపించకుండా, జుట్టు కట్టుకుంటే కనిపించే చెవి వెనుక టాటూలు కూడా యువతలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి పియర్సింగ్‌లు, హెయిర్‌స్టైల్స్‌తో చక్కగా సరిపోతాయి. ఎప్పుడూ కనిపించాల్సిన అవసరం లేకుండా వ్యక్తిగత అభిరుచిని వ్యక్తపరిచే అవకాశం కల్పిస్తాయి.
ఫ్యాషన్‌కు అనుగుణంగా మారుతున్న టాటూ ప్లేస్మెంట్
ఇప్పటి తరంలో టాటూను ఫ్యాషన్‌లో భాగంగా చూస్తున్నారు. దుస్తులు, ఆభరణాలు, హెయిర్‌స్టైల్‌కు అనుగుణంగా టాటూ ప్లేస్‌మెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫైన్‌లైన్ ఫ్లోరల్స్, స్క్రిప్ట్‌లు, అలంకార డిజైన్లు కాలర్‌బోన్, వెన్నెముక, పక్కటెముకల వంటి సన్నని భాగాల్లో మరింత అందంగా కనిపిస్తాయి. అలాగే ఈ ప్రాంతాల్లో చర్మం ఎక్కువగా సాగకపోవడం వల్ల టాటూ డిజైన్లు ఎక్కువకాలం స్పష్టంగా కనిపించే అవకాశం కూడా ఉంటుంది.
2026లో అసలు ట్రెండ్ ఇదే
2026లో ఒకే ఒక్క టాటూ ప్లేస్మెంట్ ట్రెండ్‌గా మారలేదని, ప్రతి ప్లేస్మెంట్ వెనుక ఉన్న ఉద్దేశమే ప్రధాన ట్రెండ్‌గా మారిందని నిపుణులు చెబుతున్నారు. టాటూ డిజైన్, శరీర ఆకృతి, వ్యక్తి జీవనశైలి – ఈ మూడు అంశాలు సమతుల్యంగా కలిసినప్పుడే టాటూ అందంగా, అర్థవంతంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో టాటూ వేయించుకునే ముందు ప్లేస్‌మెంట్‌పై ఆలోచించడం కూడా డిజైన్‌ను ఎంచుకోవడంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..