Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Plastic Bucket Cleaning Tips: ఇంట్లో, బాత్రూమ్లో నిత్యం ఉపయోగించే ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులు కొంతకాలం తర్వాత తెల్లటి లేదా పసుపు రంగు పొరతో మురికిగా కనిపిస్తుంటాయి.. రెగ్యులర్‌గా వాటిని శుభ్రం చేసే ప్రయ్నం చేసినా.. వాటిపై ఉన్న జిడ్డు మరకలు తొలగిపోవు.. సబ్బు, డిటర్జెంట్‌తో ఎన్నిసార్లు శుభ్రం చేసినా ఈ మరకలు పూర్తిగా పోవు. ముఖ్యంగా ఉప్పు లేదా కఠిన నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు బకెట్ ఉపరితలంపై పేరుకుపోవడం వల్ల ఈ పొర ఏర్పడుతుంది. ఈ మరకలను తొలగించేందుకు గంటల తరబడి బకెట్‌ను బలంగా రుద్దాల్సిన అవసరం లేదు. ఇంట్లో సులభంగా లభించే కొన్ని పదార్థాలతోనే మొండి ఖనిజపు మరకలను తొలగించవచ్చు.
వెనిగర్, బేకింగ్ సోడాతో సులభంగా శుభ్రం
బకెట్‌పై మరకలు ఎక్కువగా పాతవి కాకపోతే తెల్ల వెనిగర్, బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు. రెండు టీస్పూన్ల బేకింగ్ సోడాను సుమారు అర కప్పు తెల్ల వెనిగర్‌తో కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్పాంజ్, గుడ్డ లేదా పాత టూత్‌బ్రష్‌తో మరకలు ఉన్న ప్రాంతాల్లో రాయాలి. 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత స్క్రబ్బర్‌తో మెల్లగా రుద్ది, శుభ్రమైన నీటితో కడగాలి.
Also Read
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
నిమ్మరసం, ఉప్పుతో తెల్లటి మరకలకు చెక్
మరకలు తేలికగా ఉన్నప్పుడు నిమ్మరసం, ఉప్పు కూడా మంచి ఎంపిక. నిమ్మకాయను సగానికి కోసి, దాని కోసిన భాగానికి కొద్దిగా ఉప్పు రాసి మరకలు ఉన్న ప్రాంతాల్లో రుద్దాలి. మొండి మరకలు ఉంటే ముందుగా నిమ్మరసం రాసి సుమారు 10 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో మెల్లగా శుభ్రం చేసి నీటితో కడగాలి. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ ఖనిజ నిక్షేపాలను వదులు చేయడంలో సహాయపడుతుంది.
చాలా పాత మరకలకు సిట్రిక్ యాసిడ్
బకెట్‌పై చాలా కాలంగా పేరుకుపోయిన మందపాటి ఖనిజపు పొర ఉంటే సిట్రిక్ యాసిడ్ ఉపయోగించవచ్చు. గోరువెచ్చని నీటితో బకెట్‌ను నింపి అందులో 2 నుంచి 3 టీస్పూన్ల సిట్రిక్ యాసిడ్ పొడి వేసి బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత నీటిని తొలగించి, స్క్రబ్బర్‌తో కొద్దిగా డిష్‌వాషింగ్ లిక్విడ్ ఉపయోగించి శుభ్రం చేయాలి. చివరగా శుభ్రమైన నీటితో బాగా కడగాలి.
మరకలు మళ్లీ రాకుండా ఇలా చేయండి
బకెట్‌పై ఖనిజపు పొర మళ్లీ ఏర్పడకుండా ఉండాలంటే ఉపయోగించిన తర్వాత అందులో నీరు నిల్వ ఉండకుండా పూర్తిగా ఖాళీ చేయాలి. బకెట్‌ను తలకిందులుగా ఉంచడం మంచిది. ఉపరితలంపై నీటి చుక్కులు ఎక్కువసేపు ఉండకుండా చూసుకుంటే మరకలుగా మారి.. అవి మొండివాటిలా మారకుండా తగ్గించవచ్చు.
తాజావార్తలు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!