Perfect Homemade Paneer Tips: ఇంట్లోనే మెత్తటి పనీర్ తయారు చేయండి.. ఈ 5 చిట్కాలు మిస్ కావొద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perfect Homemade Paneer Tips: పనీర్‌తో రకరకాల వంటకాలు తయారు చేస్తున్నారు.. పనీర్ అంటే చాలా మందికి ఇష్టమైన ఆహారం.. ముఖ్యంగా విందులు, ప్రత్యేక సందర్భాలు, కుటుంబ భోజనాల్లో పనీర్ వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పనీర్ రుచికరంగా ఉండటమే కాకుండా, ఇందులో ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వల్ల శాకాహారులకు ఇది మంచి ఆహారంగా భావిస్తారు. అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే పనీర్‌పై కల్తీ భయాలు పెరగడంతో చాలా మంది ఇంట్లోనే పనీర్ తయారు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
ఇంట్లో పనీర్ తయారు చేయడం సులభమే అయినప్పటికీ, చాలాసార్లు అది గట్టిగా మారిపోతుంది. మార్కెట్‌లో దొరికే హల్వాయి స్టైల్ మెత్తటి పనీర్ లాగా రావడం లేదని చాలామంది బాధపడుతుంటారు. ఇందుకు ప్రధాన కారణం తయారీ సమయంలో చేసే కొన్ని పొరపాట్లే.
Also Read
- Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
- Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
- Ragi Pindi Upma: డయాబెటిస్, వెయిట్ లాస్ కోసం బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. రాగి ఉప్మాను సింపుల్‌గా ఇలా చేసుకోండి!
- Ragi Barfi : ఈ ఒక్క స్వీట్ తింటే ఎముకలకు కొండంత బలం.. నోరూరించే రాగి బర్ఫీ సీక్రెట్ రెసిపీ!
పనీర్ గట్టిగా మారడానికి కారణాలేమిటి?
పాలు విరిగిన తర్వాత ఎక్కువసేపు మరిగించడం వల్ల పనీర్ రబ్బరు లా మారుతుంది. అలాగే పనీర్‌పై గంటల తరబడి ఎక్కువ బరువు పెట్టడం వల్ల అందులోని తేమ పూర్తిగా పోయి గట్టిపడుతుంది. వేడిగా ఉన్న పనీర్‌ను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టినా అది లోపల బయట గట్టిగా మారే అవకాశం ఉంది.
మెత్తటి పనీర్ కోసం ఈ 5 చిట్కాలు తప్పకుండా పాటించండి
1. నిమ్మరసం లేదా వెనిగర్ నెమ్మదిగా కలపండి: పాలు విరిచే సమయంలో నిమ్మరసం లేదా వెనిగర్‌ను ఒకేసారి పోయకుండా కొద్దికొద్దిగా వేయాలి. నీరు లేత ఆకుపచ్చగా మారగానే ఆపేయాలి.
2. వెంటనే మంట ఆర్పేయండి: పాలు విరిగి చెన్నా వేరుపడగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఎక్కువసేపు ఉడికిస్తే పనీర్ గట్టిపడుతుంది.
3. చల్లటి నీటితో కడగండి: వడకట్టిన చెన్నాపై వెంటనే చల్లటి నీళ్లు పోయాలి. దీంతో ఉడికే ప్రక్రియ ఆగిపోతుంది. అలాగే నిమ్మరసం లేదా వెనిగర్ పులుపు కూడా తొలగిపోతుంది.
4. ఎక్కువసేపు బరువు పెట్టవద్దు: పనీర్‌కు ఆకారం రావడానికి 30 నుంచి 40 నిమిషాలు బరువు పెడితే సరిపోతుంది. బుర్జీ లేదా సలాడ్ కోసం అయితే 15 నుంచి 20 నిమిషాలే చాలు. ఎక్కువసేపు బరువు పెడితే అది చూయింగ్ గమ్‌లా మారుతుంది.
5. చల్లటి నీటిలో నానబెట్టండి: బరువు తీసిన తర్వాత పనీర్‌ను వెంటనే కోయకుండా 10 నుంచి 15 నిమిషాలు చల్లటి నీటిలో ఉంచాలి. ఇలా చేస్తే బయట పొర గట్టిగా, లోపల మాత్రం క్రీమీగా మెత్తగా ఉంటుంది. మొత్తంగా ఇంట్లో పనీర్ తయారు చేసినప్పుడు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ప్రతిసారీ హోటల్ స్టైల్ మెత్తటి పనీర్ సిద్ధమవుతుంది. కుటుంబ సభ్యులకు రుచికరమైన పనీర్ వంటకాలు సులభంగా చేసిపెట్టవచ్చు.
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!