Toilet Cleaning Tips: టాయిలెట్ సీటుపై జిడ్డు మరకలు పోవట్లేదా..? నిమిషాల్లో మెరిసేలా చేసే చిట్కాలు ఇవే..

Toilet Cleaning Tips

Toilet Cleaning Tips

Toilet Cleaning Tips: ఇంట్లో శుభ్రం చేయడానికి అత్యంత ఇబ్బందికరమైన ప్రదేశాల్లో టాయిలెట్ సీటు ఒకటి. ముఖ్యంగా టాయిలెట్ సీటుపై ఏర్పడే పసుపు రంగు మొండి మరకలు ఎంత రుద్దినా సులభంగా పోవు. వాటిని తొలగించడానికి చాలామంది ఖరీదైన కెమికల్ క్లీనర్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే ఆ రసాయనాల ఘాటు వాసన కళ్లకు, ముక్కుకు చికాకు కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరంగా మారే అవకాశం ఉంటుంది.. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సులభమైన ఇంటి చిట్కా వైరల్ అవుతోంది. అదే ఐస్ క్యూబ్స్‌తో టాయిలెట్ సీటును శుభ్రం చేసే పద్ధతి. ఈ చిట్కా వింతగా అనిపించినా, మొండి మరకలను సులభంగా వదులుచేసి టాయిలెట్‌ను మెరిసేలా చేయడంలో ఇది బాగా పనిచేస్తుందని చెబుతున్నారు.

టాయిలెట్‌పై పసుపు మరకలు ఎందుకు వస్తాయి?
టాయిలెట్ సీటుపై కనిపించే పసుపు మరకలకు ప్రధాన కారణాలు గట్టినీరు, మూత్రపు మరకలు మరియు సున్నపురాయి పేరుకుపోవడం. కాలక్రమేణా ఇవి గట్టిగా పట్టుకుని సాధారణ బ్రష్‌తో తొలగించడం కష్టమవుతుంది. ముఖ్యంగా చాలా రోజులుగా శుభ్రం చేయకపోతే మరకలు మరింత లోతుగా చేరిపోతాయి.

×
×
Ad

ఐస్ క్యూబ్స్ ఎలా పనిచేస్తాయి?
ఐస్ క్యూబ్స్ ఉపయోగించడం వెనుక ఒక ప్రత్యేకమైన సైన్స్ ఉంది. టాయిలెట్‌పై చల్లటి ఐస్ ఉంచినప్పుడు మరకలపై అకస్మాత్తుగా చల్లదనం ప్రభావం చూపుతుంది. దీనివల్ల గట్టిగా పేరుకుపోయిన మురికి కుంచించుకుని చిన్న పగుళ్లు ఏర్పడతాయి. దీంతో మరకలు వదులై సులభంగా తొలగిపోతాయి. ఈ ప్రక్రియను “థర్మల్ షాక్ ఎఫెక్ట్” అని అంటారు.

ఐస్ క్యూబ్స్‌తో టాయిలెట్ ఎలా శుభ్రం చేయాలి?
ముందుగా ఫ్రీజర్ నుంచి గుప్పెడు ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి. వాటిని టాయిలెట్ బౌల్‌లో, ముఖ్యంగా మరకలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేయాలి. ఆ తర్వాత 20 నుంచి 30 నిమిషాల వరకు అలాగే వదిలేయాలి. ఈ సమయంలో చల్లదనం మరకలపై పనిచేస్తుంది. తరువాత టాయిలెట్ బ్రష్‌తో మెల్లగా రుద్దాలి. అప్పటికే మరకలు వదులై ఉండటంతో అవి సులభంగా తొలగిపోతాయి. చివరగా ఫ్లష్ చేస్తే టాయిలెట్ మరింత శుభ్రంగా కనిపిస్తుంది. మరకలు చాలా పాతవైతే ఇదే పద్ధతిని మరోసారి ప్రయత్నించవచ్చు..

ఇంకా మంచి ఫలితాల కోసం ఈ చిట్కాలు పాటించండి
* ఐస్ క్యూబ్స్‌తో పాటు కొద్దిగా వెనిగర్ ఉపయోగిస్తే మరింత మంచి ఫలితం వస్తుంది..
* టాయిలెట్‌ను తరచుగా శుభ్రం చేయడం అలవాటు చేసుకోవాలి
* ప్రతి ఉపయోగం తర్వాత సరిగా ఫ్లష్ చేయాలి
* మరకలు గట్టిపడకముందే శుభ్రం చేస్తే శ్రమ తగ్గుతుంది

ఈ సులభమైన ఇంటి చిట్కాతో ఖరీదైన క్లీనర్‌ల అవసరం లేకుండానే టాయిలెట్ సీటును మెరిసేలా ఉంచుకోవచ్చు. ఎప్పటికప్పుడు క్లీన్‌ చేయడం ద్వారా మరకలు మొండిగా.. జిడ్డుగా మారకుండా చూసుకోవచ్చు..