Site icon NTV Telugu

Habit Effects: పిల్లల్లో ఈ అలవాటు చాలా ప్రమాదకరం..!

Thumb Sucking Habit, Children

Thumb Sucking Habit, Children

చిన్నపిల్లలు ఏ పని చేసిన ముద్దుగానే అనిపిస్తుంది. అలా అని వారి అలవాట్లను లైట్ తిసుకోవద్దు. వాటిలో బొటనవేలు చప్పరించడం. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కొందరు పెద్ద పిల్లల వరకు ఈ అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటును లైట్ తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు వల్ల పిల్లలకు ఆరోగ్య పరంగా చాలా సమస్యలు వస్తాయి. పిల్లలు సాధారణంగా ఈ అలవాటును రెండు ఏళ్ల వయసులో మానేస్తారు. కానీ, ఈ వయసు దాటిన తర్వాత కూడా బొటనవేలు చప్పరించే అలవాటు మానకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్యలేంటి? ఈ అలవాటు ఎలా మాన్పించాలి? ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read : Surya : సూర్య రెట్రో ఓటిటి రిలీజ్ డేట్ ఇదేనా..!

1. బొటనవేలు పీల్చడం వల్ల ముందు దంతాలు ముందుకు పొడుచుకుని రావడం, దవడ నిర్మాణం తప్పు దోవ పడటం జరుగుతుంది. దీని ఫలితంగా భవిష్యత్తులో ఆర్థోడాంటిక్ చికిత్స అవసరం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా నోటి చుట్టూ ఉన్న చర్మం నిరంతరం తడిగా ఉండటం వల్ల చర్మం పొడిబారడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. పిల్లల నాలుక, నోటి కండరాల అభివృద్ధికి ఇది అడ్డుగా నిలిచే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా పదాలను సరిగా పలకలేకపోవడం, మాట్లాడటంలో ఇబ్బంది పడటం వంటి సమస్యలు ఎదురవుతాయి.

2. చిన్న పిల్లల చేతులు చాలా మురికిగా ఉంటాయి. ఇలాంటి సమయంలో పిల్లలు వేళ్లు నోట్లో పెట్టుకున్నప్పుడు చేతులపై ఉండే బ్యాక్టీరియా లేదా క్రిములు నోట్లోకి ప్రవేశిస్తాయి. దీని కారణంగా బిడ్డకు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు లేదా ఇతర జీర్ణ సమస్యలు రావచ్చు. ఇది మాత్రమే కాదు, తరచుగా నోటి పూతల లేదా గొంతు నొప్పి కూడా ఈ చెడు అలవాటు ఫలితంగా రావచ్చు.

3. మన చేతి బొటనవేలు లేకుంటే ఏ పని చేయలేము. పిల్లలు ఈ బొటనవేలు నోట్లో పెట్టుకోవడం వల్ల బలహీనపడటం తో పాటు.. దీర్ఘకాలంగా ఈ అలవాటు కొనసాగితే చర్మంపై చిన్న గాయాలు ఏర్పడి ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. దీన్ని నియంత్రించడానికి పిల్లల గట్టిగా బెదిరించిన తప్పులేదు. కానీ దీని వల్ల వారు మానసికంగా ఇబ్బంది పడతారు. అందుకే ప్రేమగా వారి అలవాటును మాన్పించేందుకు ట్రై చేయండి. దగ్గర కూర్చోబెట్టుకుని ఈ అలవాటు వల్ల వచ్చే సమస్యలు వివరించండి. బొమ్మలు, పుస్తకాలతో దృష్టి మళ్లించడం అవసరం. చేదు రసాయనాలను వాడటం, చేతి తొడుగులు తొడిపించడం కూడా ఒక మార్గం.

4. వేపాకు రసం బొటనవేలుకు అప్లై చేయండి. దీంతో చేదు కారణంగా ఈ అలవాటును త్వరగా మానేస్తారు. ఈ అలవాటు మానేస్తే ఏదో ఒక గిఫ్ట్ లేదా ఆటబొమ్మ కొనిపెడతాం అని ఆశ చూపించండి. దీంతో క్రమక్రమంగా ఈ అలవాటును మానుకుంటారు.

5. కొంత మంది పిల్లలు కొన్ని సమయాల్లో మాత్రమే వేళ్లు చప్పరిస్తారు. నిద్రపోయే ముందు వేలు పెట్టుకుంటారు. మరికొందరు ఏదైనా ఒత్తిడి, టెన్షన్‌లో ఉన్నప్పుడు ఇలా చేస్తుంటారు. ఆ సమయాన్ని గమనించి.. వాటి పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలుంటాయని నిపుణులు అంటున్నారు. బిడ్డ ఆరోగ్య భద్రత కోసం ఈ అలవాటు తీవ్రమయ్యే లోపు చర్యలు తీసుకోవడం ఏంతైనా తల్లిదండ్రుల బాధ్యత. ప్రేమతో, సహనంతో తీసుకున్న నిర్ణయాలు వారికి ఆరోగ్యంగా ఎదగడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version