Site icon NTV Telugu

భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చేయాల్సిన పనులు ఇవే..

Man Caring For Pregnant Wife

Man Caring For Pregnant Wife

మహిళలకు అమ్మతనం అనేది పునర్జన్మ.. ఆ సమయంలో ప్రతి నిమిషం ఒక్క తియ్యటి అనుభూతిని ఇస్తుంది.. అలాగే ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. తిండి విషయంలో మాత్రమే కాదు. ప్రతిదీ జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి.. వారితో పాటు వారి కడుపులోని బిడ్డ ప్రాణాలు వారి చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. అలాంటి విషయాల్లో కుటుంబం సభ్యులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.. ముఖ్యంగా భార్య గర్భంతో ఉన్నప్పుడు భార్య తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణ సమయంలోనే మసాజ్ చేయడం వల్ల చాలా వరకూ రిలాక్స్ అవుతారు. ఈ సమయంలో వారి కాళ్ళకి మసాజ్ చేయడం వల్ల చాలా రిలాక్స్ అవుతారు.. ఈ విషయంలో భర్త ముందడుగు వెయ్యాలి.. భార్య కాళ్లు నేనెందుకు పట్టుకోవాలి అనే ఆలోచనను వదిలెయ్యడం మంచిది..

గర్భిణీలకు ఏవేవో తినాలానే కోరిక ఉంటుంది.. దాన్ని తెలుసుకొని మీరే స్వయంగా చేసి వడ్డీస్తే వాళ్లు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు.. వారి శరీరంలో మార్పులు వస్తాయి. దీంతో వారు బాధపడతారు. అదే విధంగా, వారు వారి అందంపై దృష్ఠి సారించలేరు. ఆ సమయంలోనూ వారి అందాన్ని మెచ్చుకోవడం చెయ్యాలి..

గర్భవతులలో హార్మోన్లు చేంజ్ అవుతూ ఉంటాయి.. వారు ఫీలింగ్స్ కూడా వెంటనే మారతాయి.. కోపం, బాధ ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటిని భర్త అర్థం చేసుకోవాలి. కొద్దిగా భరించాలి. వారికి దగ్గరుండి అన్ని చూసుకోవాలి.. భర్త అర్థం చేసుకొని ఓదార్చాలి.. వాళ్లు ఆ సమయంలో ఎక్కువగా నిద్రపోవాలి.. ఆ విషయంలో భర్తల సహకారం కూడా ఉండాలి.. ఈ విషయాల్లో భర్త చొరవ తీసుకుంటే భార్య చాలా సంతోషంగా ఉంటారు.. వారి ప్రసవం కూడా సులువుగా అవుతుంది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version