NTV Telugu Site icon

Memory Power : మీరు జ్ఞాపకశక్తి పెంచుకోవాలి అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..

Untitled 14

Untitled 14

Memory Power: ప్రతి ఒక్కరు మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉండడం చాలా ముఖ్యం. ముఖ్యంగా విద్యార్థులు చదివింది గుర్తుపెట్టుకోవాలి అంటే జ్ఞాపక శక్తి బాగుండాలి. అయితే జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ఓ అద్భుతమైన మార్గం ఉందని చెప్తున్నారు నిపుణులు. అదే డైరీ రాయడం. అవును డైరీ రాయడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడం మాత్రమే కాదు ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయని. ఆ ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పడు చాల మందికి డైరీ రాయడం ఒక అలవాటుగా ఉండేది. తనకు నచ్చిన వ్యక్తుల గురించి..సంతోషం వచ్చిన, బాధ కలిగిన, చేసిన తప్పులు, ఒప్పులు ఇలా ప్రతిది డైరీ లో రాసుకునే వారు. కానీ ప్రస్తుతం పెరిగిన సాంకేతికత కారణంగా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాకి అలవాటు పడ్డారు. ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Read also:Odisha Train Tragedy : ఒడిశా రైలు ప్రమాదం.. 28 గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు

కానీ డైరీ రాయని వ్యక్తుల కంటే డైరీ రాసె వ్యక్తులకి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుందని కొన్ని అధ్యాయనాలు పేర్కొంటున్నాయి. అలానే డైరీ రాయడం వల్ల భావోద్వేగాలను అదుపుచేసుకోగలరు. అలానే చేసిన తప్పులు, ఒప్పుల గురించి తెలుస్తుంది. భవిష్యత్తులో ఏం చెయ్యాలి అనే విషయంపైన స్పష్టత వస్తుంది. అలానే మంచి నడవడికను అలవరుచుకునేందుకు డైరీ రాయడం ఉత్తమమైన మార్గం. అయితే చాలంది డైరీని రాత్రి పడుకోబోయే ముందుగా రాస్తుంటారు. కానీ అలా రాత్రి రాయడం కంటే సాయంత్రం సమయంలో డైరీ రాయడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.