NTV Telugu Site icon

Star Hospitals : 35 సంవత్సరాల వ్యక్తికి విజయవంతంగా కాలేయం ఉభయతమ్మెల మార్పిడి

Star Hsptl

Star Hsptl

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ స్టార్ హాస్పిటల్స్ విజయవంతంగా కాలేయం ఉభయతమ్మెల మార్పిడిని (డ్యూవ‌ల్ లోబ్ లివ‌ర్ ట్రాన్స్‌ప్లాన్ట్‌) 16 గంటల్లో పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. క‌ర్నూల్‌కి చెందిన 35 ఏళ్ల మ‌హేశ్ కి తన భార్య, సోదరుడి నుంచి తీసిన రెండు కాలేయతమ్మెల మార్పిడి చేశారు. అతిగా మద్యం సేవించడం వల్ల మహేష్ కు కాలేయవ్యాధి వచ్చింది
116 కిలో గ్రాముల శారీరకబరువు ఉన్న మ‌హేశ్‌ అంతిమదశలో ఉన్న కాలేయవ్యాధితో స్టార్ హాస్పిటల్స్ లోని డా. రాఘవేంద్ర బాబు (ఛీఫ్ ఆఫ్ లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంట్‌) ఆధ్వ‌ర్యంలో అతిసంక్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. ఒకేసారి కాలేయంలోని రెండుతమ్మెలను విజయవంతంగా మార్చిన అతికొద్దిమంది మనదేశ వైద్యులలో ఒకరుగా వారు నిలుస్తూ, ఎందరో వ్యాధిగ్రస్తులలో కొత్త విశ్వాసాన్ని నింపుతున్నారు.

ఆప‌రేష‌న్ జ‌రిగిన ప‌ద్ధ‌తి:

మద్యపానం అలవాటు వున్న మహేష్ కు ప్రాథమిక పరీక్షల అనంతరం పరిస్థితి, ప్రామాణికమైన కాలేయమార్పిడి మార్గదర్శక నియమాలకు అనుగుణంగా లేదని స్పష్టమయింది. మహేష్ కి, తన భార్య కాలేయాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నా, మహేష్ కాలేయమార్పిడి అవసరాలకు తగినంత పరిణామంలో భార్య కాలేయం లేదని గుర్తించారు. తర్వాత, సుమారు 97 కిలోల శారీరక బరువున్న మహేష్ సోదరుడు కాలేయదాతగా పనికి రావచ్చ‌ని వైద్యులు గుర్తించారు. అయితే, ఆ సోదరుడికి గతంలో ఉన్న మద్యపాన దురలవాటు వల్ల వచ్చిన కాలేయనాపు కారణంగా వారి కాలేయం – ఈ మార్పిడికి పనికిరాదని తేలింది. ఆ దశలో ఇటు మహేష్ ఆరోగ్యపరిస్థితికూడా క్షీణిస్తూఉండటంతో – ఎవరైనా మృతుల కాలేయం లభించేంతవరకూ ఆగి ఉండే అవకాశం లేకపోయింది.

పేషంట్‌ మహేష్ పరిస్థితిని గుర్తించిన ఛీఫ్ ఆఫ్ లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంట్‌ డా. రాఘవేంద్ర బాబు ఈ దశలో డ్యుయల్ లోబ్ లివర్ ట్రాన్స్ ప్లాంట్’ ఒక్కటే అతని ప్రాణాలను కాపాడగలదని స్పష్టం చేశారు. (డ్యుయల్ లోబ్ లివర్ ట్రాన్స్ ప్లాంట్) అంటే, కాలేయంలో కుడి, ఎడమ వైపుల ఉండే రెండుతమ్మెలను ఒకేసారి మార్చటం. ఇది చాలా క్లిష్టమైన శస్త్రచికిత్స, మనదేశంలో చాలా అరుదుగా జరుగుతున్న ప్రక్రియ. ఇక, ఈ పద్ధతి శస్త్రచికిత్సలో అత్యంత విజయాలను చూస్తున్న దక్షిణ కొరియా వంటి దేశాలలోనూ, బహు అరుదుగానే జరుగుతున్న ప్రక్రియ ఇది. దీని డా. రాఘవేంద్ర బాబు, వైద్య బృందం 16 గంటల్లో పూర్తి చేసింది.