Sprout salad: పచ్చి “మొలకలు’’ తినలేకపోతున్నారా, అయితే ఇలా చేయండి.. ఉదయాన్నే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్..
- పచ్చి మొలకలు తినలేకపోతున్నారా.?
- మొలకల సలాడ్ ట్రై చేయండి..
- ఉదయాన్ని హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sprout salad: మొలకలు (Sprouts) మన ఆరోగ్యాన్ని రక్షించే అద్భుత ఆహారంగా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలా మంది ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా వీటిని తీసుకుంటున్నారు. గింజలను నానపెట్టి మొలకలు తెప్పించడం వల్ల వీటిలోని ఆరోగ్య విలువలు పెరుగుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ కంట్రోల్ ఉండాలనుకునే వారికి మొలకలు మంచివి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శాఖాహారులకు మొలకలు ప్రొటీన్స్ సోర్స్‌గా చెప్పవచ్చు. వీటిలో ఉండే అమైనో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. వీటిలో విటమిన్ A, C, K ,బి-కాంప్లెక్స్ ఉంటాయి.
అయితే, పచ్చి మొలకలు తినడం వల్ల చాలా మంది కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. టేస్ట్ లేకపోవడం, గ్యాస్ సమస్యలు ఎదురుకావచ్చు. ఇలాంటి సమయాల్లోనే మొలకలతో డిఫరెంట్ ఆహారాన్ని ట్రై చేయాలి. రుచితో పాటు ఆరోగ్యం కావాలనుకునే వారికి ‘‘మొలకల సలాడ్’’ మంచి ఆప్షన్. ఇంట్లో ఉండే కూరగాయలతోనే దీనిని రెడీ చేసుకోవచ్చు.
Also Read
- White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
- Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
తయారీ విధానం:
ముందుగా మొలకల సలాడ్ కోసం పచ్చి వాటిని స్టీమ్ చేయడం లేకపోతే కొన్ని నిమిషాల పాటు ఉడించాలి. ఇలా చేయడం వల్ల మృదువుగా మారుతాయి.
వీటిలో కీర, టమాటో, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ, బీట్రూట్లను సన్నగా తరిగి వేసుకోవాలి. కూరగాయాల్ని చేర్చడం వల్ల విటమిన్స్, పీచు పదార్థం మరింత పెరుగుతుంది.
కూరగయాల్ని మొలకలతో కలుపుకోవాలి. దీంట్లోనే కాసింత ఉప్పు, నిమ్మరసం చేర్చుకోవాలి. మిర్చి వాడకుంటే కొద్దిగా మిరియాల పొడిని కూడా చేర్చుకోవచ్చు. వీటిన్నింటిని కలిపిన తర్వాత మొలకల సలాడ్ తయారు అవుతుంది. పచ్చి మొలకలతో పోలిస్తే మొలకల సలాడ్ చాలా సింపుల్‌గా ఎంతో రుచిగా ఉంటుంది. ఇది శరీర నిర్మాణానికి, ఆరోగ్యానికి, షుగర్ వంటి వ్యాధులు కంట్రోల్ కావడానికి ఎంతో సహాయపడుతుంది.
తాజావార్తలు
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
-
Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
-
Vaibhav Sooryavanshi: బీసీసీఐ సమీక్ష సమావేశం.. వైభవ్ సూర్యవంశీపై కీలక నిర్ణయం!
-
Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిపోయిన దర్శకుడు.. ఇప్పుడు విరాట్, అనుష్కపై కన్ను!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!