Site icon NTV Telugu

Shocking News: ప్రస్తుత ఆడపిల్లలు త్వరగా మెచ్యూర్ అవ్వడానికి కారణం ఇదే..!

Antibiotics,early Puberty, Girls

Antibiotics,early Puberty, Girls

ఒకప్పుడు ఆడపిల్లలు పద్నాలుగు పదిహేను ఏళ్ళకి మెచ్యూర్ అయితే ఇప్పుడు పన్నెండు పదమూడు ఏళ్ళకే అవుతున్నారు. ఈ మార్పును మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. ఇంత చిన్నప్పుడే మెచ్యూర్ అవ్వడం ఎమోషనల్‌గా ఇబ్బంది పెడుతుంది. తరువాత కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అలాగని కొంత మంది పద్నాలుగేళ్ళకి కూడా మెచ్యూర్ అవ్వకపోతే మాత్రం ఆందోళన చెందవలసిన విషయమే. డాక్టర్‌ని కన్సల్ట్ చేసి కారణం ఏమిటో తెలుసుకోవాలి. అలాగే, ఎనిమిదేళ్ళకి ముందే మెచ్యూర్ అయినా కూడా ఖంగారు పడే విషయమే. అప్పుడు కూడా డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. ఒకవేళ ఆరేళ్ళ కంటే ముందే ఇలా జరిగితే మాత్రం అస్సలు మంచిది కాదు, తప్పనిసరిగా ఇలా జరగడానికి గల కారణాన్ని తెలుసుకోవాలి. అయితే లేటెస్ట్‌‌గా ఈ విషయం పై స్టడీ చేయగా షాకింగ్‌ రిజల్ట్స్‌ వచ్చింది..

Also Read : Health Tips : పసుపు, తేనె కలిపి తీసుకుంటే..ఎన్ని లాభాలో తెలుసా !

పిల్లలకు రెండేళ్లు వచ్చేవరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఏ చిన్న వాతావరణ మార్పు జరిగినా వారు తట్టుకోలేక సులువుగా జబ్బు పడుతుంటారు. దీంతో చాలా వరకు యాంటీ బయోటిక్స్ మందులు వాడాల్సి వస్తుంది. అయితే ఈ యాంటీ బయోటిక్స్ శిశువు జబ్బుని త్వరగా నయం చేస్తుంది కానీ, ఈ యాంటీ బయోటిక్స్ తాత్కాలికంగా రిలీఫ్ కలిగించినప్పటికి దీర్ఘకాలంలో మాత్రం మరో విధంగా ఎఫెక్ట్ చూపిస్తాయని తాజాగా ఓ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా 3 నెలల్లోపు బాలికలకు యాంటీ బయోటిక్స్ ఇవ్వడం ద్వారా ముందుగానే మెచ్యూర్‌ అయ్యే ప్రమాదం ఉందట. అంటే వారిలో హార్మోన్లు గాడితప్పి ఎర్లీ ఏజ్‌లోనే రుతుక్రమం మొదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయాని ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లి గుర్తించాలి అని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

Exit mobile version